Advertisementt

అపురూపంగా అమ్మని విష్ చేసిన చిరు

Sun 08th May 2022 12:45 PM
chiranjeevi,pawan kalyan,anjana devi,nagababu,mothers day special,chiru wishes to mother anjana devi  అపురూపంగా అమ్మని విష్ చేసిన చిరు
Chiranjeevi video on mothers day touches hearts అపురూపంగా అమ్మని విష్ చేసిన చిరు
Advertisement
Ads by CJ

ఈ రోజు మథర్స్ డే. మే మొదటి ఆదివారం మథర్స్ డే స్పెషల్ గా జరుపుకుంటారు. ఈ రోజు తమ తల్లులకు అపూరంగా విష్ చేస్తూ వాళ్లతో కలిసి ప్రేమతో గడిపిన మధుర క్షణాలను అందరితో పంచుకుంటారు. ఇక సెలబ్రిటీస్ అయితే తన తల్లితో గడిపిన క్షణాలను వీడియోస్, ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముళ్ళతో, తన తల్లితో కలిసి ఉన్న మధుర క్షణాలను ఓ వీడియో రూపంలో షేర్ చేస్తూ తన తల్లి అంజనా దేవికి మథర్స్ డే విషెస్ తెలియజేసారు.

చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబు ఓ షూటింగ్ లొకేషన్ లో తమ తల్లి అంజనాదేవితో కలిసి భోజనం చేస్తూ, తర్వాత తమ తల్లిని ఎంతో అపురూపంగా కారు ఎక్కించిన దృశ్యాలు వారు షేర్ చేసిన వీడియో లో చూడొచ్చు. పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటారనే విషయం ఈ వీడియో లో తేట తెల్లమైంది. ఇక ఆ వీడియో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ వకీల్ సాబ్ లోని మగువ మగువ పాట మ్యూజిక్ ని ప్లే చేసారు.

Chiranjeevi mothers day video

Chiranjeevi video on mothers day touches hearts:

Mega Star Chiranjeevi mega tributes to all mothers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ