ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aadi Pinisetty,Nikki Galrani wedding date revealed

ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని పెళ్ళి తేదీ ఫిక్స్

Aadi Pinisetty,Nikki Galrani wedding date revealedAadi Pinisetty,Nikki Galrani wedding date revealed

కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ నిక్కీ గల్రానిని ఆదిపినిశెట్టి ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మొన్నీమధ్యనే తమ ప్రేమని కన్ఫర్మ్ చేస్తూ ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నిశ్చితార్ధం ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ప్రేమ బంధం పెళ్లి తో ఏడడుగులు నడవడానికి సిద్దమైనట్లుగా చెప్పారు. ఈ ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల మధ్యన సింపుల్ గా జరగగా.. ఈ వేడుకకి టాలీవుడ్ నుండి ఆది ఫ్రెండ్ నాని, అలాగే ప్రముఖ డిజైనర్ నీరజ కోన హాజరయ్యారు.

ఇక తాజాగా ఆది పిన్ని శెట్టి- నిక్కీ గల్రాని పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఆది పినిశెట్టి వివాహం ఈ నెల 18వ తేదీన చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరుగనుంది. అయితే ఈ పెళ్ళి ఆది కుటుంబ సంప్రదాయం ప్రకారం జరుగనుంది అని, ఆది-నిక్కీ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, దగ్గరి బంధువులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు అని తెలుస్తుంది. పెళ్లి తర్వాత చెన్నైలో ప్రముఖ రిసార్ట్స్ లో ఆది - నిక్కీల రిసెప్షన్ నిర్వహిస్తారని, ఈ వేడుకకి టాలీవుడ్ ప్రముఖులు, అలాగే కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కానున్నారని చెబుతున్నారు.

Aadi Pinisetty, Nikki Galrani wedding date fix

aadi pinisetty
nikki galrani
aadi pinisetty - nikki galrani wedding date
aadi pinisetty-nikki galrani wedding reception