Advertisementt

బిగ్ బాస్: ఈ వారం ఇంటికెళ్లిందెవరంటే..

Sun 08th May 2022 10:25 AM
bigg boss,bigg boss non stop,ashu reddy gets eliminated,ashu reddy,akhil  బిగ్ బాస్: ఈ వారం ఇంటికెళ్లిందెవరంటే..
Bigg Boss NOn Stop 10th week elimination బిగ్ బాస్: ఈ వారం ఇంటికెళ్లిందెవరంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి పదవ వారం పూర్తి చేసుకుంది. 11 వ వారంలోకి అడుగుపెట్టబోతుంది. మరొక్క రెండు వారాల్లో బిగ్ బాస్ ఓటిటి గ్రాండ్ ఫినాలే కి సిద్దమవుతుంది. ఈ లోపు హౌస్ నుండి ఇంకెంతమంది ఎలిమినేట్ అవుతారు, ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేదాని మీద అందరూ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ వారం అఖిల్, బిందు మాధవి, అనిల్, అరియనా, ఆశు రెడ్డి, మిత్ర శర్మ, యాంకర్ శివ నామినేషన్స్ లో ఉండగా.. ఎప్పటిలాగే ఓటింగ్ లో అఖిల్ నెంబర్ వన్ స్థానంలో బిందు సెకండ్ ప్లేస్ లో ఆ తర్వాత యాంకర్ శివ మూడో స్థానంలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

అయితే డేంజర్ జోన్ లో అనిల్ - ఆశు రెడ్డి లు ఉండగా.. మిత్ర శర్మ ఇంతకుముందులాగే ఐదో స్థానాల్లో సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రతి వారం మిత్ర సేఫ్ జోన్ లో ఉండడంపై అందరిలో ఎన్నో అనుమానాలున్నాయి. అయితే ఈ వారం ముందు నుండి అనుకున్నట్టుగానే ఆశు రెడ్డి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ తో రచ్చ చేస్తున్న ఆశు రెడ్డి అజయ్ ఎలిమినేట్ అయ్యాక చాలా డల్ అయ్యింది. తర్వాత అఖిల్ కూడా దూరం పెట్టడంతో ఆమె మరింతగా సైలెంట్ గా మారింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ల్లోనూ ఆశు రెడ్డి ఓడిపోయింది. అఖిల్ అక్కడ ఆశుని కట్ చేసి అరియానని సేవ్ చెయ్యడంతో మరింత ఫీలైంది. ఇక నాలుగో సీజన్ లో మధ్యలోనే ఎలిమినేట్ అయిన అశు రెడ్డి, ఈ ఓటిటి లో చివరి వరకు వచ్చి ఎలిమినేట్ అయ్యింది. ఆ ఎపిసోడ్ ఈ రోజు రాత్రి ప్రసారం కాబోతుంది.

Bigg Boss NOn Stop 10th week elimination:

BB Non-Stop: Ashu Reddy gets eliminated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ