లక్కీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న.. ఆ భాషా లేదు, ఈ భాషా లేదు.. అన్ని భాషల్లో సినిమాలు చేస్తూనే పాన్ ఇండియా మూవీ లో నటించేసింది. తెలుగులో పుష్ప మూవీ, తమిళ్ లో విజయ్ తో కలిసి నటిస్తున్న రష్మిక మలయాళంలో దుల్కర్ సినిమాలో నటిస్తుంది. ఇక బాలీవుడ్ లో అయితే చెప్పక్కర్లేదు. పలు ప్రాజెక్ట్స్ తో పాప బిజీగా వుంది. అయితే ఇప్పుడు రష్మిక మాయలో ఓ దర్శకుడు ఉన్నట్టుగా మరో హీరోయిన్ కీర్తి సురేష్ బయట పెట్టడం ఆసక్తికరంగా మారింది. అంటే రష్మిక తో కలిసి ఓ సినిమా చేసిన ఆ దర్శకుడు తన నెక్స్ట్ సినిమా కి పని చేస్తున్న కీర్తి సురేష్ ని కూడా రష్మిక రష్మిక అనే పిలిచారట. అదెవరో కాదు.. గీత గోవిందం తో అటు విజయ్ ఇటు రష్మిక మాత్రమే ఓవర్ నైట్ స్టార్స్ అవ్వలేదు. దర్శకుడు పరశురామ్ కూడా మహేష్ తో సినిమా ఛాన్స్ కొట్టేసాడు.
అయితే రష్మిక గీత గోవిందం మూవీ తోనే లక్కీ హీరోయిన్ గా మారింది. ఆ సినిమా అప్పుడు ఆమెతో వర్క్ చేసిన పరశురామ్.. ఆమెని పిలిచి పిలిచి అలవాటైపోయుంటుంది. అలా ఇప్పుడు సర్కారు వారి పాట షూటింగ్ టైం లో కీర్తి సురేష్ ని కూడా రష్మిక రష్మిక అంటూ పిలిచేవారట. షూటింగులో నాతో పనిచేస్తూ పరుశురాం రష్మిక.. రష్మిక.. రష్మిక మందన్న పేరును కలవరించే వారు.. అంటూ కీర్తి సురేష్ సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయట పెట్టింది. తర్వాత రశ్మికతో పని చేసేటప్పుడు ఆమెని కీర్తి అని పిలుస్తారా.. లేదా చూడాలి అంటూ పరశురామ్ రష్మిక మాయలో ఎంతగా మునిగిపోయాడో కీర్తి సురేష్ బయటపెట్టేసింది.