హైదరాబాద్ లో జరిగిన సర్కారు వారి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ లు అంటూ ఎవరూ లేకపోయినా.. మహేష్ అక్కడ తన సినిమాకి తానే గెస్ట్ గా కనిపించారు. నిజంగా అందమైన మహేష్, అద్భుతంగా కనిపించడమే కాదు, ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా కనబడిన మహేష్ బాబు కి స్టేజ్ పై ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న మేజర్ మూవీ హీరో అడివి శేష్ అదిరిపోయే ప్రశ్నలు సంధించాడు. అందులో తన సినిమాని ప్రొడ్యూస్ చేసినందుకు థాంక్స్ చెప్పిన శేష్.. మహేష్ తో కాఫీ విత్ కరణ్ షో లా ప్లాన్ చేశామని అన్నాడు. కానీ మహేష్ ఫాన్స్ ఆ సెటప్ ని స్పాయిల్ చేసారు.
ఇక శేష్ అండ్ మహేష్ కూర్చుని ఆ ప్రశ్నలు అడుగబోతుంటే.. మహేష్ సెటైరికల్ గా సుమ గారు నించుంటే నాకు కుర్చీలో కూర్చోబుద్ది కావడం లేదు, అలాగే మా హీరోయిన్ కీర్తి సురేష్ నుంచుంటే నేనెలా కూర్చుంటా అంటూ పంచ్ వేశారు. తర్వాత అడివి శేష్ సర్ మేము ఇంటికి రావడం లేట్ అయితే పది మిస్సెడ్ కాల్స్, 15 మెసేజెస్ ఉంటాయి.. వాటిని మీరు ఫేస్ చేస్తారా అని అడిగితె దానికి మహేష్.. నాకు అట్లాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే నేను ఉంటే ఇంట్లో ఉంటాను, లేదంటే షూటింగ్ లో ఉంటాను అంతే. తర్వాత శేష్ నేను ఈవెంట్ కోసం విజయవాడ వెళుతుంటే.. 25 కిలోమీటర్లు నుండి మీ బ్యానర్ లు, కటౌట్స్, మీ హోర్డింగ్స్ చూసాను, మీకు మెమొరబుల్ ఫ్యాన్ ఎక్సపీరియెన్స్ ఏముంది అని అడగగా.. ఫాన్స్ నాకిచ్చిన వరం. నిజంగా అదృష్టం. నేను అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నా. వాళ్ళని సంతోషపెట్టడానికి అన్నారు మహేష్.
ఇక తర్వాత మీ GMB బ్యానర్ లో వేరే హీరో తో పని చెయ్యడం మీకు ఎలా అనిపించింది అని అడగగా.. మేజర్ అనే సినిమాని ప్రొడ్యూస్ చెయ్యడం నేను చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్నా, జూన్ 3 న రాబోతున్న ఆ సినిమా మీకు నచ్చుతుంది అని, థాంక్స్ శేష్ అని హాగ్ ఇచ్చారు.