మహేష్ బాబు సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో మహేష్ ఫాన్స్ ఆనందోత్సాహాల మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్, సినిమాలో విలన్ పాత్రధారి సముద్రఖని తో పాటుగా, పుష్ప డైరెక్టర్ సుకుమార్, ఎప్పటిలాగే వంశి పైడిపల్లి లు గెస్ట్ లుగా హాజరయ్యారు. మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా ఎంట్రీ ఇవ్వగా.. కళావతి కీర్తి సురేష్ సారీ తో గ్లామర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సర్కారు వారి పాట ఈవెంట్ లో సినిమాలో నుండి మాస్ సాంగ్ మ..మ.. మహేశా రిలీజ్ చేసారు.
మహేష్ బాబు మాస్ లుక్, కీర్తి సురేష్ గ్లామర్ లుక్ లో కనిపించిన ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో మాస్ లిరిక్స్ తో అదరగొట్టేసింది. అయితే ఈ సాంగ్ ని సుకుమార్ అలా రిలీజ్ చెయ్యగానే.. అక్కడే కింద ఉన్న మహేష్ ఫాన్స్ ఆ సాంగ్ కి కాలు కదుపుతూ డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసారు. మహేష్ మాదిరిగా స్టెప్స్ వేస్తూ మహేష్ ఫాన్స్ ఆ మ..మ.. మహేశా సాంగ్ ని ఎంజాయ్ చేసారు. ఇప్పటికే కళావతి సాంగ్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంటే.. ఇప్పుడు ఈ మ..మ.. మహేశా మాసివ్ సాంగ్ ఫాన్స్ కి కిక్ ఇచ్చేలా కనిపిస్తుంది.