Advertisementt

మహేష్ ఫాన్స్ కి మహేష్ సర్ ప్రైజ్ లెటర్

Sat 07th May 2022 05:14 PM
mahesh babu,mahesh babu letter to fans,sarkaru vaari paata,mahesh fans,theaters,ssmb 28,trivikram - mahesh combo  మహేష్ ఫాన్స్ కి మహేష్ సర్ ప్రైజ్ లెటర్
Mahesh Surprise Letter to Mahesh Fans మహేష్ ఫాన్స్ కి మహేష్ సర్ ప్రైజ్ లెటర్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట రిలీజ్ అవడానికి ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోపులో సర్కారు వారి పాట ప్రమోషన్స్ తో ఫాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని కలగజేస్తుంది టీం. ఈ రోజు హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. మరికొద్ది గంటల్లో సర్కారు వారి పాట ఈవెంట్ మొదలు కాబోతుంది. ఇప్పటికే మహేష్ ఫాన్స్ గుంపులు గుంపులుగా పోలీస్ గ్రౌండ్స్ దగ్గర నానా హంగామా చేస్తున్నారు.

ఈ సమయంలో మహేష్ తన ఫాన్స్ ని ఉద్దేసింది ఓ లెటర్ రాయడం అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఆ లెటర్ లో సర్కారు వారి పాట షూటింగ్‌ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన సర్కారువారి పాట చిత్రం థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు అంటూ ఫాన్స్ ని ఉద్దేశించి రాసిన మహేష్ లెటర్ వైరల్ అయ్యింది. 

అంతేకాకుండా మహేష్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్ కూడా చెప్పేసారు మహేష్. అదే మహేష్-త్రివిక్రమ్ కలయికలో మొదలు కావల్సిన SSMB28 జూన్ లో మొదలు కాబోతుంది అని అప్ డేట్ ఇవ్వడంతో మహేష్ ఫాన్స్ గాల్లో తేలిపోతున్నారు.

Mahesh Surprise Letter to Mahesh Fans:

Mahesh Babu letter to fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ