Advertisementt

కేజిఎఫ్ మోహ‌న్ జునేలా హఠాన్మరణం

Sat 07th May 2022 02:36 PM
kgf,kgf 2,actor mohan juneja,mohan juneja passes away,kannada industry  కేజిఎఫ్ మోహ‌న్ జునేలా హఠాన్మరణం
KGF actor Mohan Juneja passes away కేజిఎఫ్ మోహ‌న్ జునేలా హఠాన్మరణం
Advertisement
Ads by CJ

ఇప్పుడు కేజిఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్స్ గురించి, అందులో నటించిన హీరో, స్టార్స్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాటలే ఇంకా ఇంకా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సినిమా విడుదలై నెల గడుస్తున్నా ఇంకా కేజిఎఫ్2 వార్తలు వింటూనే ఉన్నాము. ఇప్పటివరకు సినిమా హిట్ గురించి, సినిమా గురుంచి, సినిమా కొల్లగొట్టిన కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేజిఎఫ్ గురించిన ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. అది కేజిఎఫ్ లో నటించిన ఓ నటుడు హఠాత్తుగా మరణించడం.

కేజిఎఫ్ లో నటించిన క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన నటుడు మోహ‌న్ జునేజా ఈ రోజు మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహ‌న్ జునేజా(54) బెంగుళూరులోని ఓ ప్ర‌వేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటూ ఈ రోజు శ‌నివారం ఆయ‌న క‌న్నుమూశారు. క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా పలు భాషల సినిమాల్లో నటించిన ఆయన కేజిఎఫ్ లో రాకీ భాయ్ గురించిన విషయాలను ఓ జర్నలిస్ట్ కి చెప్పే కేరెక్టర్ లో నటించారు. క‌న్నడ చిత్ర ప‌రిశ్ర‌మ మోహ‌న్ జునేలా మృతి విష‌యం తెలిసి దిగ్బ్రాంతికి లోన‌య్యింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

KGF actor Mohan Juneja passes away:

KGF Mohan Juneja passes away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ