మెగాస్టార్ చిరు తో సినిమా చేస్తున్నాం.. ఆయనతో సినిమా చెయ్యాలంటే కంఫర్ట్ గా ఉండాలి కానీ.. మెగాస్టార్ ఏమైనా అనుకుంటారేమో.. ఆయన 153 సినిమాలు చేసిన సీనియర్ మాత్రమే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు.. సో ఆయనకి ఇలాంటి సీన్స్ అయితే బావుంటాయి, ఇలా ఉంటే ఇప్పుడు ఆడియన్స్ కి నచ్చుతుంది అని చెప్పాలంటే చాలామంది దర్శకులు జంకుతారు. ఇప్పుడు చిరు తో చేస్తున్న దర్శకులంతా ఇంతకుముందు ఆయతో సినిమాలు చెయ్యలేదు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నవారంతా మెగాస్టార్ తో కొత్తే.
నిన్నగాక మొన్న కొరటాల శివ కూడా తన పెన్ లోని పవర్ మెగాస్టార్ ముందు తలవొంచేలా చేసింది. కొరటాల కథ కూడా మెగాస్టార్ సీనియరిటిని డామినేట్ చెయ్యలేకపోయింది. అందుకే ఆచార్య ఫలితం ఆలా ఉంది అంటున్నారు విమర్శకులు. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ విషయంలోనూ, మెహెర్ రమేష్ విషయంలోనూ, పెద్దగా సక్సెస్ లేని బాబీ కూడా మెగాస్టార్ ని హైలెట్ చేస్తారేమో, మళ్ళీ కథ పక్కదారి పట్టిపోతుందేమో అంటూ తెగ ఫీలైపోతున్నారు మెగా ఫాన్స్. కానీ మెగాస్టార్ తన దర్శకులకి అలాంటి భరోసా ఇవ్వాల్సిందే. నాతో ఫ్రీగా ఉండండి, ఆడియన్స్ కి నచ్చేలా చెయ్యండి, నన్ను ఇంప్రెస్స్ చెయ్యడం కాదు అని చెప్పాలి. రాజమౌళి వర్క్ కి నేను మ్యాచ్ అవను, ఆయన్ని నేను సంతృప్తి పరచలేను అని ఎలా చెప్పారో.. ఇప్పుడు చేస్తున్న దర్శకులకి తనకి మధ్యలో రాపో ఉండేలా చూసుకుంటే.. ఇకపై చిరు సక్సెస్ కొట్టడం ఖాయం అని అంటున్నారు నెటిజెన్స్.