ఇంట్రెస్టింగ్: విజయ్ - పూజ కాంబో?
JGM: Vijay Devarakonda to romance Pooja Hegde?లైగర్ మూవీ తో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ క్రేజ్.. బాలీవుడ్ లో భీభత్సంగా ఉంది. అక్కడ బాలీవుడ్ ప్రముఖులతో పార్టీలు, అలాగే హీరోయిన్స్ తో స్నేహం విజయ్ దేవరకొండ క్రేజ్ ని మరింతగా పెంచేసాయి. ఇక లైగర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరి తో కలిసి మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టేసాడు. అదే పూరి డ్రీం ప్రాజెక్ట్ జన గణ మన. ఈ సినిమా లో బాలీవుడ్ గ్లామర్ గర్ల్ జాన్వీ కపూర్ సౌత్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. విజయ్ దేవరకొండ తో కలిసి నటించబోతుంది అంటూ ప్రచారం జరిగినా దానిని జాన్వీ కొట్టిపారేసింది. తాను ఎలాంటి సౌత్ మూవీ చెయ్యడం లేదని స్పష్టత నిచ్చింది. అయితే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అది విజయ్ దేవరకొండ తో మొదటిసారి బుట్టబొమ్మ పూజ హెగ్డే జోడి కట్టబోతుంది అంటూ ఆ న్యూస్ సారాంశం.
ప్రస్తుతం మూడు వరస ప్లాప్స్ తో ఉన్న పూజ హెగ్డే విజయ్ దేవరకొండ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అని, పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజ అయితే అన్ని లాంగ్వేజెస్ కి సూట్ అవుతుంది అని పూరి అనుకుంటున్నారట. అందుకే విజయ్ దేవరకొండ సరసన పూజ ని ఎంపిక చెయ్యబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఆ న్యూస్ హడావిడి చేస్తుంది. మరి ఈ న్యూస్ నిజమైతే పూజ హెగ్డే నక్క తోక తొక్కినట్టే. ఇక విజయ్ దేవరకొండ శివ నిర్వాణ తో చేస్తున్న VD11 లో పాన్ ఇండియా హీరోయిన్ సమంత తో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
Pooja Hegde Aboard Jana Gana Mana For Vijay Devarakonda







































