Advertisementt

మెగా లీకులు కలవరపెడుతున్నాయి

Fri 06th May 2022 12:43 PM
ram charan,rc15,,shankar,dil raju,mega fans  మెగా లీకులు కలవరపెడుతున్నాయి
Leaks Begin From RC15 Shooting మెగా లీకులు కలవరపెడుతున్నాయి
Advertisement
Ads by CJ

ఇప్పుడు సినిమాలను భారీ బడ్జెట్ లు పెట్టి తెరకెక్కించడం ఛాలెంజింగ్ గా అనిపించడం లేదు. ఎందుకంటే ఏ ఫైన్షియర్ దగ్గరో డబ్బు తెచ్చి సినిమా తెరకెక్కించి హిట్ కొడితే అవే లాభాలో.. నష్టాల్లో వస్తాయి. కానీ ఇప్పుడు సినిమా తెరకెక్కుతుంది అంటే మేకర్స్ కి ఛాలెంజ్ గా తయారయ్యింది లీకులు. భారీ బడ్జెట్ సినిమాలకు ఈ లీకుల బెడద బాగా ఎక్కువైంది. ఈమధ్యన సర్కారు వారి పాట అప్ డేట్ రావడమే ఆయా సాంగ్స్, ఆయా సీన్స్ లీకైపోయి సోషల్ మీడియాలో హడావిడి చేసేశాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ - శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 విషయంలోనూ ఇదే జరుగుతుంది.

రాజమండ్రి దగ్గర చిత్రీకరించిన షెడ్యూల్ లో రామ్ చరణ్ సైకిల్ మీద వెళుతున్న లుక్ లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నిన్నటికి నిన్న వైజాగ్ లో జరుగుతున్న షెడ్యూల్ లో.. RC 15 సెట్స్ నుండి రామ్ చరణ్ పవర్ ఫుల్ స్టూడెంట్ లుక్ లీక్ చేసారు. చరణ్ స్టూడెంట్ లుక్ మాసివ్ గా ఉండడంతో.. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. RC15 నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ కాకుండా ఇలాంటి లీకులు బయటికి వస్తే సినిమా మీద హైప్ తగ్గుతుంది అంటూ మెగా ఫాన్స్ తెగ ఫీలైపోతున్నారు. శంకర్ అండ్ దిల్ రాజు ఎంతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఈ లీకులకు అడ్డుకట్ట వెయ్యలేకపోవడంతో.. ఫాన్స్ ఆందోళన పడుతున్నారు.

Leaks Begin From RC15 Shooting:

Ram Charan leaked look from RC15 goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ