Advertisementt

సర్కారు వారి పాట సెన్సార్ టాక్

Fri 06th May 2022 10:21 AM
mahesh babu,sarkaru vaari paata,keerty suresh,sarkaru vaari paata censor talk,sarkaru vaari paata review  సర్కారు వారి పాట సెన్సార్ టాక్
Sarkaru Vaari Paata Censored సర్కారు వారి పాట సెన్సార్ టాక్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట అప్ డేట్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. మరొక్క వారంలో పాట పాడడానికి బరిలోకి దిగబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ బాబు కేరెక్టర్ ని పరశురామ్ ఖలేజాలో మహేష్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నట్లుగా మహేష్ ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సర్కారు వారి పాట ట్రైలర్ తోనే సంచలనాలకు తెర లేపిన మేకర్స్.. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు. ఈ శనివారం యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారని అన్నప్పటికీ.. అది కేవలం గాసిప్ గానే తేలిపోయింది. 

ఇక తాజాగా సర్కారు వారి పాట సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడమే కాదు.. ఇప్పుడు సెన్సార్ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సర్కారు వారి పాట కి కమిటీ యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక సినిమా అద్భుతంగా ఉంది అని, ఫాన్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే ఎలివేషన్స్ సినిమాలో చాలా ఉన్నాయని, పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట అంటూ సెన్సార్ కమిటీ చెబుతున్న మాట గా తెలుస్తుంది. మహేష్ ఎంట్రీ సీన్స్ తోనే కామెడీ జొప్పించారని, మహేష్ బాబు - కీర్తి సురేష్ కలయికలో వచ్చే సీన్స్ రొమాంటిక్ గా ఉన్నాయని, ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవబోతున్నాయని, అలాగే మహేష్ బాబు కామెడీ టైమింగ్, మహేష్ లుక్, మహేష్ డైలాగ్ డెలివరీ అన్ని సినిమాకి హైలెట్స్ గా నిలవడం ఖాయమంటూ సెన్సార్ టాక్ వినిపిస్తుంది.

Sarkaru Vaari Paata Censored:

Sarkaru Vaari Paata Censor secrets out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ