ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన రానా - సాయి పల్లవి ల విరాట పర్వం మూవీ గురించిన అప్ డేట్స్ లేక చాలామంది ఆ సినిమాపై నెగెటివ్ ప్రచారం మొదలు పెట్టారు. విరాట పర్వం మూవీ ఫైనల్ కట్ లో మార్పులు చేర్పులు , విరాట పర్వం ఓటిటి లో వచ్చేస్తుంది.. ఇలా చాలా ప్రచారం జరిగింది. మధ్యలో రానా కొన్ని రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే చాలారోజులుగా వార్తల్లో లేని విరాట పర్వం ఫైనల్లీ వార్తల్లోకి వచ్చింది. సడన్ గా మేకర్స్ విరాట పర్వం కి రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ అంటూ అప్ డేట్ ఇచ్చారు.
ఈ రోజు శుక్రవారం సాయంత్రం విరాట పర్వం రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ ఉంటుంది అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. కరోనా పాండమిక్ సిట్యువేషన్ తో రిలీజ్ ఆగిన సినిమాలన్నీ మళ్ళీ పరిస్థితులు చక్కబడడంతో రిలీజ్ డేట్స్ ఇచ్చేసి థియేటర్స్ లోకి వచ్చి వెళ్ళిపోయినా.. విరాట పర్వం మేకర్స్ కామ్ ఉన్నారు. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా నక్సలైట్ గాను, సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ప్రియమణి కూడా నక్సలైట్ గా కీ రోల్ ప్లే చేసిన విరాట పర్వం రిలీజ్ డేట్ అప్ డేట్ పై అందరి లో ఆసక్తి బయలు దేరింది.