Advertisementt

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్.. వాట్ ఏ సర్ ప్రైజ్

Fri 06th May 2022 09:33 AM
ntr,lakshmi pranathi,prashanth neel,ntr wedding anniversary,prashanth neel wedding anniversary  ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్.. వాట్ ఏ సర్ ప్రైజ్
NTR celebrates his marriage anniversary with Prashant Neel ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్.. వాట్ ఏ సర్ ప్రైజ్
Advertisement
Ads by CJ

ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఒకరు పాన్ ఇండియా మార్కెట్ నే గడగడలాడించారు. మరొకరు కెజిఎఫ్ చాప్టర్ 2 అంటూ పలు భాషల బాక్సాఫీసుని దున్నేశారు. అలాంటి సంచలనాలు కలిస్తే ఎలా ఉంటుంది.. అటు ఫాన్స్ కి పండగ.. ఇటు సోషల్ మీడియాకి నిండుగా ఉంటుంది. మరి ట్రిపుల్ ఆర్ తో బ్రహ్మాండమైన హిట్ కొట్టిన ఎన్టీఆర్- కెజిఎఫ్ తో మాస్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకే ఫ్రేమ్ లో కనబడితే ఫాన్స్ ఆగుతారా.. అస్సలాగరు. కానీ అది జరిగింది. మే 5 న ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతి వెడ్డింగ్ యానివర్సరీ, అదే రోజు ప్రశాంత్ నీల్ వెడ్డింగ్ యానివర్సరీ. ఎలాగూ ఇద్దరికీ మూవీ ఓకె అయ్యింది. సో ఒకే రోజు పెళ్లి రోజు కావడంతో హైదరాబాద్ లోనే ఉన్న ప్రశాంత్ నీల్ ఆయన భార్యకి ఎన్టీఆర్ అండ్ ప్రణతి అదిరిపోయే పార్టీ ఇచ్చారు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సలార్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ ఇంకా కొరటాల మూవీ కి షిఫ్ట్ అవ్వలేదు. సో అలా ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ తమ పెళ్లి రోజుని తమ సతీమణులతో ఎన్టీఆర్ ఇంట్లో సెలెబ్రేట్ చేసుకున్నారన్నమాట. ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతి మే 5 న వివాహం చేసుకున్నారు. ఈ మే 5 కి వారు పెళ్లి చేసుకుని 11 ఏళ్ళు పూర్తయ్యింది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అదే రోజు వివాహం చేసుకున్నారు. ఇక కెజిఎఫ్ తర్వాత ప్రభాస్ సలార్ కంప్లీట్ చేసాక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఈలోపు కొరటాల మూవీ కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ NTR31 లో జాయిన్ అవుతారు.

NTR celebrates his marriage anniversary with Prashant Neel:

NTR celebrates his marriage anniversary with a surprise

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ