Advertisementt

బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి

Thu 05th May 2022 07:24 PM
anchor ravi,telugu bigg boss ott,big boss non stop,bigg boss  బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి
Anchor Ravi in Bigg Boss non stop house బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ పదవ వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం అనిల్ అండ్ ఆశు రెడ్డి లు నామినేషన్స్ లో లీస్ట్ ఓటింగ్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఇరువురిలో ఆశు కానీ, అనిల్ కానీ ఎలిమినేట్ అవ్వబోతున్నారని అంటున్నారు. ఇక తదుపరి వారం మాట ఎలా ఉన్నా ప్రస్తుతం హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే సిరి బాబా భాస్కర్ ని టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ ని చేసింది. తర్వాత మానస్ అనిల్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ రోజు యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. యాంకర్ రవి గత సీజన్ లో 12 వారాల వరకు హౌస్ లో ఉండి చివరిలో ఎలిమినేట్ అయ్యాడు.

అయితే హౌస్ లోకి వచ్చాక కంటెస్టెంట్స్ తన దగ్గర ఉన్న మ్యాజిక్ బాక్స్ ని అందుకోవాలంటే టాస్క్ చెయ్యమన్నాడు. అనిల్ అర్జున్ రెడ్డిలా, మిత్ర శర్మ అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ ప్రీతి లా నటించగా.. యాంకర్ శివ మిత్ర తమ్ముడిలా మారిపోయాడు. మా అక్కనేమ్ చేస్తావ్ అంటూ అర్జున్ రెడ్డితో గొడవ పడ్డాడు. ఇక ఆ తర్వాత బిందు మాధవి - మిత్ర మధ్య జరిగిన గొడవని ఇమిటేట్ చేసారు. ఎడిక్షన్ ఫ్రీ పాస్ కోసం కొన్ని టాస్క్ లు ఆడించాడు రవి. మరి ఈ టాస్క్ ల్లో ఈ రోజు ఎవరు గెలిచి టికెట్ టు ఫినాలే మూడో కంటెండర్ అయ్యారో ఈ రోజు ఎపిసోడ్ లో చూడాలి.

Anchor Ravi in Bigg Boss non stop house:

Anchor Ravi Hungama In Telugu Bigg Boss OTT House 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ