Advertisementt

ఫారిన్ ట్రిప్ ముగించేసిన మహేష్ అండ్ ఫ్యామిలీ

Thu 05th May 2022 06:03 PM
superstar mahesh babu,mahesh family,hyderabad,namratha,sitara,gautham,sarkaru vaari paata  ఫారిన్ ట్రిప్ ముగించేసిన మహేష్ అండ్ ఫ్యామిలీ
Mahesh Babu returns to Hyderabad ఫారిన్ ట్రిప్ ముగించేసిన మహేష్ అండ్ ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్యనే తన సినిమా సర్కారు వారి పాట షూటింగ్ ముగించేసి తన ఫ్యామిలీని తీసుకుని ఫారిన్ ట్రిప్ వేసేసారు. మహేష్ కి చిన్నపాటి ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తారు. అలాగే కొద్దిరోజులు గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్ళిపోతారు. ఇది మహేష్ లైఫ్ లో రొటీన్ గా మారిపోయింది. కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో లాక్ డౌన్ అంటూ అందరూ ఇళ్ళకి పరిమితమైనప్పుడు మహేష్ అన్న వెకేషన్స్ కి వెళ్లలేక ఏమైపోతాడో అని ఎన్టీఆర్ తెగ ఫీలైనట్టుగా ఓ షోలో చెప్పాడు. మరి పిల్లలతో స్పెండ్ చెయ్యాలంటే అలా వెకేషన్స్ కి వెళ్ళాలి అంటారు మహేష్. ఇక్కడ ఫ్రెండ్స్ తో బిజీగా వుంటారు. అదే ట్రిప్ వెళితే మనము వాళ్లతో టైం స్పెండ్ చెయ్యొచ్చు అనేది మహేష్ భావన.

ఇక తాజాగా పారిస్ ట్రిప్ కి వెళ్లిన మహేష్ అండ్ ఫ్యామిలీ అక్కడ చేసిన ఎంజాయ్ మెంట్ ని ఎప్పటికప్పుడు ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసేవారు నమ్రత. సితార, గౌతమ్ తో మహేష్ ఫుల్ గా హోటల్ లో ఛిల్ అయిన ఫొటోస్ చూసి ఫాన్స్ కూడా ఎగ్జైట్ ఆయారు. ఇక సర్కారు వారి పాట ప్రమోషన్స్ దగ్గర పడుతుండడంతో మహేష్ తన ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ ముగించేసి హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎయిర్ పోర్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్, నమ్రత, గౌతమ్, సితారలు మాస్క్ వేసుకుని ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.

ఇక సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా రేపు శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు మేకర్స్. హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో మహేష్ సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు మొదలు పెట్టింది టీం.

Mahesh Babu returns to Hyderabad :

Superstar Mahesh Babu, his family return to Hyderabad 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ