Advertisementt

NTR బర్త్ డే కి ఏదో సర్ ప్రైజ్ అంటున్నారు

Thu 05th May 2022 11:56 AM
ntr,koratala siva,ntr fans,ntr birthday,ntr30  NTR బర్త్ డే కి ఏదో సర్ ప్రైజ్ అంటున్నారు
Koratala Siva huge plans to surprise NTR fans on NTR birthday NTR బర్త్ డే కి ఏదో సర్ ప్రైజ్ అంటున్నారు
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ బర్త్ డే దగ్గరకొచ్చేస్తుంది. అసలే ఆర్ ఆర్ ఆర్ హిట్ తో జోష్ లో ఉన్నారు ఎన్టీఆర్ ఫాన్స్. ఆర్ ఆర్ ఆర్ హిట్ ని ఎంజాయ్ చేసి ఆంజనేయస్వామి మాలతో దీక్షలోకి వెళ్ళిన ఎన్టీఆర్ మాలాధారణ తన బర్త్ డే నాటికీ పూర్తవుతుంది అని తెలుస్తుంది. ఇక ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఎన్టీఆర్ తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. గత రెండేళ్లుగా కరోనా పాండమిక్ సిట్యువేషన్ తో ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలని ఘనంగా నిర్వహించలేకపోయారు. అందుకే ఈ బర్త్ డే కి ధూమ్ ధామ్ గా కేక్ కటింగ్స్, ఎన్టీఆర్ కటౌట్ కి పాలాభిషేకాలు ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే ఎన్టీఆర్ బర్త్ డే కి ఆయన కొత్త చిత్రాల అప్ డేట్స్ రాబోతున్నాయంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల - ఎన్టీఆర్ కమలయికలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న NTR 30 నుండి అప్ డేట్ రాబోతుంది అని తెలుస్తుంది. అంటే NTR30 లుక్ గత ఏడాదే రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ స్టూడెంట్ లుక్ లో కనిపించారు. ఇప్పుడు ఆ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు జరగొచ్చని తెలుస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే NTR31 నుండి కూడా అప్ డేట్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఆయన ఫాన్స్. మరి అసలు మొదలు కానీ మూవీ నుండి ప్రశాంత్ నీల్ ఎలాంటి అప్ డేట్ ఇస్తారో తెలియదు కానీ.. ఆయన ఫాన్స్ ప్రస్తుతం #NTRManofMasses హాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

Koratala Siva huge plans to surprise NTR fans on NTR birthday:

NTR birthday: Double Dhamaka in the offing

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ