ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sarkaru Vaari Paata Pre release event details

సర్కారు వారి పాట ఈవెంట్ డీటెయిల్స్ అవుట్

Sarkaru Vaari Paata Pre release event details

మహేష్ బాబు సర్కారు వారి పాట పై రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. సర్కారు వారి పాట ప్రమోషన్స్ తో సినిమాపై క్రేజ్, అంచనాలు పెంచుతున్న టీం ట్రైలర్ రిలీజ్ తో సోషల్ మీడియాలో ఓ రికార్డ్ సెట్ చేసింది. కళావతి సాంగ్ తో యూట్యూబ్ రికార్డ్స్ ని కొల్లగొట్టిన సర్కారు వారి పాట ట్రైలర్ తో వ్యూస్ లోను, లైక్స్ లోను మరిన్ని అద్భుతాలను చూపించారు మహేష్ ఫాన్స్. ఇక రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి, ఆత్రుత ఎక్కువైపోతోంది. మహేష్ ఎప్పుడు ప్రమోషన్స్ తో రంగంలోకి దిగుతాడా అనే ఆయన ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అఫీషియల్ గా డేట్ లాక్ చేసారు మేకర్స్. అది మే 7 సాయంత్రం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఫిక్స్ చేసారు. అంటే ఈ శనివారం సాయంత్రం ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ కి మహేష్ ఫాన్స్ భారీగా హాజరవుతారని, గత రెండున్నరేళ్లుగా మహేష్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ మహేష్ ఫాన్స్ క్రేజీగా ఉన్నారు.

Mahesh Sarkaru Vaari Paata Pre release event details out

mahesh babu
sarkaru vaari paata movie
mahesh sarkaru vaari paata pre release event details