Advertisementt

ఆచార్య మేకర్స్ లో టెన్షన్ టెన్షన్

Thu 05th May 2022 10:01 AM
acharya,chiranjeevi,ram charan,koratala  ఆచార్య మేకర్స్ లో టెన్షన్ టెన్షన్
Tension in Acharya Makers ఆచార్య మేకర్స్ లో టెన్షన్ టెన్షన్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ చిత్రం ఆచార్య కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు కరువయ్యారు. చిరు, చరణ్ కలిసి చేసిన సినిమా అని క్రేజ్ కూడా లేకుండా పోయింది. కనీసం మెగా ఫాన్స్ సింగిల్ టైం సినిమాని వాచ్ చేసినా మరీ ఇంత నష్టాలూ వచ్చేవి కావేమో.. కానీ ఆచార్య ని మెగా ఫాన్స్ కూడా అవాయిడ్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఆచార్య కలెక్షన్స్ రోజు రోజుకి పడిపోతున్నాయి. మొదటి రోజే గట్టి ఓపెనింగ్స్ తెచ్చుకోలేని ఆచార్య తర్వాత రోజు కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరు, చరణ్ కాంబినేషన్ కాబట్టి బయ్యర్లు కూడా భారీ ధరలకు కొనేశారు.

కానీ ఇప్పుడు అనుకున్న టార్గెట్ రీచ్ అవడం పక్కనబెట్టి.. సగానికి సగం కాదు.. మూడొంతుల నష్టాల్లో బయ్యర్లు మునిగిపోయే లా ఉంది పరిస్థితి. దానితో ఆచార్య బయ్యర్లు నిర్మాతలను కలసి, చిరు నెక్స్ట్ సినిమాలను వారికే ఇచ్చేలా ఒప్పందం చేసుకుని సమస్య పరిష్కారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యారని, బయ్యర్లకి ప్రస్తుతం ఊరుకోబెట్టడానికి నిర్మాతలు ప్రయత్నాలు స్టార్ట్ చేసారని అని టాక్. అయితే పెద్ద స్టార్ అయినా, క్రేజీ స్టార్ అయినా.. భారీ ధరలకు కొన్న సినిమాలైనా.. హిట్ టాక్ వస్తేనే సినిమా కలెక్షన్స్ రికవరీ అవుతాయి కానీ.. కొద్దిగా మిక్స్డ్ టాక్ పడినా టార్గెట్ ని చేరుకోవడం ఈ రోజుల్లో కష్టం అని ఆచార్య దెబ్బకి అర్ధమైతే బావుంటుంది.

Tension in Acharya Makers:

Acharya box office collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ