Advertisementt

జబర్దస్త్ స్టేజ్ పై ఎంగేజ్మెంట్

Wed 04th May 2022 05:13 PM
rocket rakesh,sujatha,rocket rakesh - sujatha engagement,jabardasth stage,extra jabardasth  జబర్దస్త్ స్టేజ్ పై ఎంగేజ్మెంట్
Rocket Rakesh - Sujatha engagement skit జబర్దస్త్ స్టేజ్ పై ఎంగేజ్మెంట్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ స్టేజ్ పై రష్మీ - సుధీర్ ల మధ్యలో ప్రేమ ఉంది అంటూ స్వయానా జేడ్జ్ రోజానే హైలెట్ చేసింది. తొమ్మిదేళ్లుగా వీరి మధ్యలో ప్రేమ ఉంది అంటూ జబర్దస్త్ లో హైలెట్ చేస్తూ వస్తూనే ఉన్నారు. తర్వాత వర్ష - ఇమాన్యువల్ మధ్యలో సం థింగ్ అని అన్నా.. కొన్నాళ్లు సక్సెస్ ఫుల్ గానే ఆ వ్యవహారాన్ని రోజా హైలెట్ చేస్తూ వచ్చింది. మధ్య మధ్యలో ప్రోమోస్ కోసం వర్ష - ఇమ్ము ని దగ్గర చేస్తున్నట్టుగా చూపించడం కూడా చేసారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అయినట్లుగా కనిపించలేదు. ఇక ఇప్పుడు మరో ప్రేమ కథని మొదలు పెట్టారు. 

బిగ్ బాస్ జోర్దార్ సుజాత - రాకెట్ రాకేష్ మధ్యలో ప్రేమ, ఎంగేజ్మెంట్, పెళ్లి అనే కథ నడిపిస్తున్నారు. వారి మధ్యలో ప్రేమ ఉందో.. లేదో.. కానీ.. వారిని హైలెట్ చెయ్యడానికి జెడ్జెస్ నానా తంటాలు పడుతున్నారు. రీసెంట్ గా లక్ష రూపాయల ఫోన్ సుజాత రాకేష్ కి గిఫ్ట్ ఇచ్చినట్లుగా టాక్ ఉంది. ఇక ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై దండలు వేసుకుని రాకేష్ - సుజాతలు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. సుజాత చేతికి రింగ్ కూడా తొడిగాడు రాకేష్. అయితే అక్కడే స్టేజ్ పై కూర్చున్న రాకేష్.. సుజాతతో నేనొకటి చెప్పనా.. నీకు పెళ్లైయ్యాక కన్నీళ్లు రావని చెప్పను, నీకు కష్టాలు రావని నేను చెప్పను, కానీ ఆ రెండు వచ్చినప్పుడు ఆ రెండిటిలో నేను నీకు తోడుగా ఉంటాను అని మాత్రం చెబుతాను అనగానే.. కొత్త జెడ్జెస్ ఇంద్రజ, పూర్ణ అయితే అలాగే చూస్తుండిపోయారు. ఇకపై రోజా ప్లేస్ లో ఇంద్రజ, పూర్ణ పర్మినెంట్ జెడ్జెస్ గా వస్తారేమో చూడాలి.

అయితే రాకెట్ రాకేష్ - సుజాత మధ్యలో నిజంగా ఎంగేజ్మెంట్ జరిగిందా? లేదంటే స్కిట్ లో భాగమా అనేది ఈ శుక్రవారం వస్తే కానీ చెప్పలేం.

Rocket Rakesh - Sujatha engagement skit :

Rocket Rakesh - Sujatha engagement skit in Jabardasth stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ