ఇప్పుడు ఎవరి నోట విన్నా ప్రశాంత్ నీల్ మాటే. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళికి పోటిగా తయారైన కన్నడ సంచలనం ప్రశాంత్ నీల్ సినిమా అంటే అంచనాలు ఆకాశమే హద్దుగా తయారయ్యాయి. KGF తో కన్నడ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రశాంత్ నీల్ కి ఇప్పుడు విపరీతమైన క్రేజ్, ఫాన్స్ పుట్టికొచ్చాయి. హీరోలతో సమానమైన ఫాన్స్ ప్రశాంత్ నీల్ కి ఏర్పడుతున్నారు. తీసింది మూడు సినిమాలే. అయినా ఆయన క్రేజ్ ఇప్పుడు ఎల్లలు దాటేసింది. కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ అంటూ జై జైలు కొడుతున్నారు.
మరి కెజిఎఫ్ కి 15 కోట్లు పారితోషకంతో సరిపెట్టుకున్న ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ సలార్ కొచ్చేసరికి అది మరింతగా పెరిగింది. సలార్ కి ప్రశాంత్ నీల్ పారితోషకం 20 కోట్లుగా చెబుతున్నా.. తన సొంత బ్యానర్ లాంటి హోంబ్లే ఫిలిమ్స్ నుండి ఆయనకి లాభాల్లో వాటా కూడా అందబోతుందట. అయితే ప్రభాస్ తో చెస్తున్న సలార్ మూవీపై ట్రేడ్ లోను, అటు పాన్ ఇండియా మార్కెట్ లోను విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అందుకే ప్రశాంత్ నీల్ పారితోషకం కూడా పెరిగిపోతుంది. ఇక తదుపరి ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమాకి మైత్రివారు ఆయన పారితోషకం 25 కోట్లకి మాట్లాడుకుని ముందుగా అడ్వాన్స్ కూడా పే చేశారట. కానీ ఆయన రోజు రోజుకి పెరుగుతున్న క్రేజ్ చూసుకుని NTR30 కి పారితోషకం ఎక్కువ డిమాండ్ చేస్తున్నారట.