స్టార్ హీరో అల్లు అర్జున్ తో రెండు సినిమాలు చేసింది. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాలు. కానీ ఆమెకి ఫేమ్ రాలేదు. అలాగే రానా సక్సెస్ ఫుల్ మూవీ నేనే రాజు నేనే మంత్రిలో నటించినా ఆమెకి ఆఫర్స్ దక్కలేదు, స్టార్ హీరోయిన్ కాలేదు. వరసగా సినిమాలు చేస్తున్నా.. బోయపాటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ వేస్తున్న కేథరిన్ థెరిస్సా ఫేట్ ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. సన్నగా నాజూగ్గా ఉండే కేథరిన్.. అందాల ఆరబోతకు సై అన్నా, గ్లామర్ రోల్స్ కి రెడీ అయినా.. పాపని పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయ్యింది.
చాలారోజుల తర్వాత కేథరిన్ శ్రీ విష్ణు తో కలిసి భళా తందనానా అంటూ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రీసెంట్ గా నిర్వహించిన భళా తందనానా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కేథరిన్ బ్లాక్ సారీ లో షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. బ్లాక్ సారీ లో గ్లామర్ గా కనిపించిన కేథరిన్ మొహం ఉబ్బిపోయి, చబ్బీగా తయారై, బాగా బరువు పెరిగి, అవుట్ అఫ్ షేప్ లో కనిపించింది. దానితో ఆమె ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవడం కాదు.. ఏంట్రా బాబు కేథరిన్ ఇలా తయారైంది. మోడరన్ గా, గ్లామర్ గా ఉండే కేథరిన్ ఇలాంటి అవతారంలో కనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్స్ అంటే ఎలా ఉండాలి, వర్కౌట్ చేస్తూ ఫిజిక్ ని మెయింటింగ్ చెయ్యాలి. అవకాశాలు లేవని వర్కౌట్స్ ఆపేస్తే ఇలానే ఉంటుంది వ్యవహారం. మరి కేథరిన్ కాస్త ఫిజిక్ మీద దృష్టి పెట్టమ్మా.. కనీసం సెకండ్ హీరోయిన్ ఛాన్స్ లైనా వస్తాయి.