ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. రాధేశ్యామ్, ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2, ఆచార్య సినిమాల్లో రెండు పోయినా.. రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక రాబోయే మహేష్ సర్కారు వారి పాటపై కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట కి ఓ గండం పొంచి ఉంది. మొన్న రిలీజ్ అయిన ఆచార్యని అదే గండం వెంటాడింది. ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో 10th, ఇంటర్ ఎగ్జామ్స్ మూడ్ లో అటు పేరెంట్స్, ఇటు స్టూడెంట్స్ ఉంటున్నారు. ఆచార్య అప్పుడు ఏపీలో 10th ఎగ్జామ్స్ మొదలైయ్యాయి. ఇక సర్కారు వారి పాట రిలీజ్ టైం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుంటాయి.
మరి సినిమాకి హిట్ టాక్ వస్తే ఓకె.. లేదంటే ఆచర్యలా రెండో రోజుకో పెట్టేబేడా సర్దుకోవాల్సి వస్తుంది. సర్కారు వారి పాటకి హిట్ టాక్ పడినా, కనీసం యావరేజ్ టాక్ పడినా.. సినిమా భారీ కలెక్షన్స్ వచ్చేస్తాయి. కాకపోతే స్టూడెంట్స్ ఇంటర్ పరీక్షలు ఓ కొలిక్కి వచ్చేవరకు థియేటర్స్ వైపు చూడరు. మరోపక్క పేరెంట్స్ అదే ఎగ్జామ్స్ ఫీవర్ లో ఉంటారు. సో ఆ రకమయిన గండం సర్కారు వారి పాటకి పొంచి ఉంది.