కరోనా పాండమిక్ సిట్యువేషన్ తో సెలబ్రిటీస్ ఎవరూ వెకేషన్స్ అంటూ విదేశీ ట్రిప్స్ మీద మోజు చూపించలేదు. కాస్త ఖాళీ దొరికితే ఫ్లైట్ ఎక్కేసే మహేష్ కూడా గత ఏడాది నుండే దుబాయ్ అలా అలా ట్రిప్స్ వేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ షూటింగ్స్ అయ్యాక ఫ్యామిలీతో పారిస్ వెళ్ళాడు. చరణ్ రెండేళ్ల తర్వాత భార్యతో కలిసి విదేశీ ట్రిప్ కి వెళ్లగా అల్లు అర్జున్ తన బర్త్ డే కి ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్లారు. అయితే చేతినిండా సినిమాలతో, కరోనా సిట్యువేషన్ తో మెగాస్టార్ చిరు కొన్నాళ్లుగా విదేశాలకు ఎక్కడికి ట్రిప్ వెయ్యలేదు. అయితే తాజాగా ఆచార్య రిలీజ్ అవ్వగానే మెగాస్టార్ ఫ్యామిలీతో వెకేషన్స్ ప్లాన్ చేసుకున్నారు.
భార్య సురేఖ తో కలిసి ఫ్లైట్ ఎక్కిన విషయం చిరు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసారు. సురేఖతో కలిసి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళ బోతున్నామని చిరు ఆ పిక్ తో పాటుగా షేర్ చేసారు. అయితే మెగాస్టార్ ఈ ట్రిప్ దాదాపు 20 రోజులు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత కూడా అంటే మే నెల చివరి వరకు చిరు దాదాపు ఆయన నెక్స్ట్ డైరెక్టర్స్ కి అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఆచార్య టాక్ ఎలా ఉన్నా.. ఆయన తదుపరి చిత్రాలైన గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ మెగా 154 చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. మళ్ళీ జూన్ మొదటి వారం నుండి ఈ సినిమాలు సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.