రామ్ చరణ్ సుకుమార్ తో రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ అయ్యాక చరణ్ బోయపాటి తో వినయ విధేయ రామ సినిమా చేశాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ సినిమా అసలు చరణ్ ఎందుకు చేసాడురా బాబు అనుకునేలా ఉంది. రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ భారీ డిసాస్టర్ ని వినయ విధేయ రామ తో అనుభవించాడు.
ఇక ఇప్పుడు మార్చ్ 25 న ట్రిపుల్ ఆర్ మూవీ తో పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు, అల్లూరిగా చరణ్ పెరఫార్మెన్స్ కి ఆయన ఫాన్స్ కి పూనకలొచ్చేశాయి. ట్రిపుల్ ఆర్ సక్సెస్ ఇంకా ముగియకముందే రామ్ చరణ్ తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ సినిమా లో రామ్ చరణ్ సిద్ద గా అద్భుతంగా నటించినా సినిమాలో దమ్ము లేకపోవడంతో ఆచార్య డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. మెగాస్టార్ కి మాత్రమే కాదు, అటు చరణ్ కి, ఇటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాలకి ఆచార్య హోల్సేల్ గా షాక్ ఇచ్చింది. ఆర్ ఆర్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా.. తర్వాత వచ్చిన ఆచార్య ప్లాప్ అయ్యింది. ఒక బ్లాక్ బస్టర్, ఒక డిసాస్టర్ ఇలా ఉంది చరణ్ ప్రస్తుత పరిస్థితి.