ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో టైటిల్ విన్నర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటిసారి ఓ మహిళా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ విన్నర్ అవడానికి రెడీ అవుతుంది. మరోపక్క బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నర్ తో సరిపెట్టుకున్న అఖిల్ సార్థక్ విన్నర్ అవడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ నాన్ స్టాప్ లో బిందు మాధవి తనదైన ఆటతీరుతో సివంగి, ఆడపులి అన్నట్టుగా గేమ్ ఆడేస్తుంది. బయట కూడా ఈ హీరోయిన్ ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో మిత్ర ప్రతిసారి డీ ఫేమ్ చేస్తుంది అని, అందుకే మిత్ర ని నామినేషన్స్ లో ఇమిటేట్ చేస్తూ హంగామా చెయ్యడంతో కొద్దిగా ఆమె టైటిల్ కి దూరమవుతుందేమో అనే ఆందోళనలో ఫాన్స్ ఉఉన్నారు.
అటు అఖిల్ కూడా బిందు మాధవితో ఉన్న గొడవలకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్టుగా ఈ వారం నామినేషన్స్ లో ప్రకటించాడు. ఇక అరియనా ఓ లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే బావుంటుంది అంటుంది. అందులో బిందు మాధవి అయితే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందుకే టైటిల్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అరియనా పోరాడుతుంది. ఇక సోషల్ మీడియాలో బిందు మాధవిని ట్రెండ్ చేస్తూ ఫాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు, అటు చూస్తే అఖిల్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో ఇప్పుడు బిందు మాధవి vs అఖిల్ అన్నట్టుగా ఉంది ఈ నాన్ స్టాప్ టైటిల్ పోరు.