పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన లైగర్ ఆగష్టు లో రిలీజ్ కి రెడీ అవుతుంది. బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ముంబై లో స్లమ్ ఏరియాలో టీ అమ్ముకునే కుర్రాడు బాక్సర్ గా ఎలా టైటిల్ గెలిచాడో అనేది లైగర్ కథగా తెలుస్తుంది. పూరి జగన్నాధ్ లైగర్ షూటింగ్ ఎక్కువ భాగంగా ముంబై పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. బాలీవుడ్ నుండి కరణ్ జోహార్ హ్యాండ్ కూడా ఈ మూవీలో ఉండడంతో.. హిందీలోనూ ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే రీసెంట్ గా లైగర్ నైజాం హక్కులను భారీ ధరకు మేకర్స్ అమ్మేసారు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. తాజాగా లైగర్ థియేట్రికల్ హక్కులని మేకర్స్ ఇంకా విక్రయించలేదని, లైగర్ ఆడియో రైట్స్ ని 14 కోట్లకి సోనీ మ్యూజిక్ దక్కించుకోగా.. లైగర్ శాటిలైట్ హక్కులని, డిజిటల్ హక్కులని కలిపి స్టార్ ఛానల్ దాదాపుగా 85 కోట్ల భారీ డీల్ కి దక్కించుకున్నారని తెలుస్తుంది. అంటే లైగర్ నాన్ థియేట్రికల్ హక్కులకు 99 కోట్లు మేకర్స్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక లైగర్ థియేట్రికల్ హక్కుల తోనే మరో అదిరిపోయే ఫిగర్ సెట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.