మల్టీస్టారర్ అంటే అలాంటి ఇలాంటి మల్టీస్టారర్ కాదు అని నిరూపించిన సినిమా ట్రిపుల్ ఆర్. ఇద్దరి స్టార్ హీరోలతో రాజమౌళి గొప్ప సాహసం చెయ్యడమే కాదు, పాన్ ఇండియాలో భారీ హిట్ కొట్టారు. కానీ అటు ఎన్టీఆర్ ఫాన్స్, ఇటు చరణ్ ఫాన్స్ రాజమౌళిని తిట్టిపోశారు. ఎన్టీఆర్ కన్నా చరణ్ ట్రిపుల్ ఆర్ లో హైలెట్ అయ్యారని, కొమరం భీముడా, ఇంటర్వెల్ సీన్స్ లో ఎన్టీఆర్ హైలెట్ అయ్యాడని చరణ్ ఫాన్స్.. ఇలా ట్రిపుల్ ఆర్ సక్సెస్ అయినా ఫాన్స్ మధ్యన ఈగో నడుస్తూనే ఉంది.
అయితే ఇప్పుడు తమిళనాట ఫాన్స్ మధ్యన ఆధిపత్య పోరు నడుస్తున్న విజయ్-అజిత్ కలయికలో సినిమా వస్తే.. అది మాములుగా ఉండదు. అజిత్ ఫాన్స్ vs విజయ్ ఫాన్స్ సోషల్ మీడియాలోనే కాదు, బయట కూడా యుద్ధం చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. మరి ఇప్పుడు అజిత్-విజయ్ కలిసి నటిస్తే ఫాన్స్ కలిసిపోతారా.. నెవ్వర్. అది జరిగే పని కాదు. కానీ ఇప్పుడొక తమిళ డైరెక్టర్ అజిత్ - విజయ్ కలయిక కోసం ఓ పవర్ఫుల్ మల్టీస్టారర్ కథని రెడీ చేస్తున్నట్టుగా చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయనెవరో కాదు.. మనాడు దర్శకుడు వెంకట్ ప్రభు రీసెంట్ మాట్లాడుతూ తన దగ్గర భారీ బడ్జెట్ తో, భారీ మల్టీస్టారర్ కథ ఉంది అని, ఆ కథకు అజిత్, విజయ్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని, వారిద్దరితోనే ఆ సినిమా చెయ్యాలని ఉంది అని ఆయన చెబుతున్నారు ఓకె. కానీ హీరోలు ఒప్పుకోవాలి, అటు ఫాన్స్ ని నొప్పించకుండా ఇద్దరినీ హైలెట్ చేస్తూ సినిమా చెయ్యాలి. అది సాధ్యమయ్యే పనేనా.. చూద్దాం ఏం జరుగుతుందో అనేది.