సర్కారు వారి పాట రిలీజ్ కి టైం దగ్గర పడిపోతుంది. మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిన సర్కారు వారి పాట ట్రైలర్ మహేష్ ఫాన్స్ నే కాదు.. అందరిని ఆకట్టుకుంది. మహేష్ కామెడీ టైమింగ్, మాసివ్ లుక్, యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ కి అందరూ ఫిదా అయ్యారు. సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్ తోనే రికార్డులు సృష్టించిన మహేష్ ఫాన్స్, ఇప్పడు ట్రైలర్ విషయంలోనూ లెక్కకు మించిన లైక్స్, వ్యూస్ తో తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అయితే సర్కారు వారి పాట ప్రమోషన్స్ మాత్రం చాలా నీట్ గా, చాలా పద్దతిగా మొదలు పెట్టారు.
అంటే హీరో మహేష్ బాబు ఇంకా రంగంలోకి దిగకపోయిన.. సినిమాకి పని చేసిన టెక్నీకల్ టీం రోజుకొక్కరు సర్వరు వారి పాట ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ దగ్గరనుండి ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, లిరికిస్ట్ అనంత్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇలా రోజుకొక్కళ్ళు వెబ్, ప్రింట్, యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ సినిమాపై హైప్ పెంచుకుటున్నారు. మరోపక్క హీరోయిన్ కీర్తి సురేష్, దర్శకుడు పరశురామ్ కొన్ని ఇంటర్వూస్ కి హాజరవుతున్నారు. ఇక నిర్మాతలు, దర్శకుడు సర్కారు వారి పాట ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొని ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. తర్వాత హీరో - హీరోయిన్ - టీం మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతుంది. సో అన్ని నీట్ గా ప్లాన్ చేసి భారీ ప్రమోషన్స్ తోనే సర్కారు వారు బరిలోకి దిగుతున్నారు.