Advertisementt

కళావతిని చూసి కూల్ అవుతున్న మహేష్ ఫాన్స్

Mon 02nd May 2022 09:00 PM
mahesh babu,keerthy suresh,sarkaru vaari paata trailer,keerthy suresh look,sarkaru vaari paata movie  కళావతిని చూసి కూల్ అవుతున్న మహేష్ ఫాన్స్
Mahesh Fans are cool about Keerthy Suresh కళావతిని చూసి కూల్ అవుతున్న మహేష్ ఫాన్స్
Advertisement
Ads by CJ

ఈరోజు వరకు మహేష్ ఫాన్స్ మహేష్ బాబు లుక్స్ విషయంలో, సర్కారు వారి పాట విషయంలో ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నా.. కళావతి అదేనండి కీర్తి సురేష్ విషయంలో చాలా దిగులు పెట్టుకున్నారు. కారణం కళావతి మోహంలో కళ మిస్ అయ్యింది అని. కీర్తి సురేష్ సన్నబడే ప్రాసెస్ లో ఆమె ఫేస్ లో గ్లో పోయింది. కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమా ఒప్పుకున్నాక రిలీజ్ అయిన రెండు మూడు సినిమాలైన మిస్ ఇండియా, పెద్దన్న సినిమాల్లో కీర్తి సురేష్ లుక్ చూసిన మహేష్ ఫాన్స్ ఝడుసుకున్నారు. 

కళావతి సాంగ్ రిలీజ్ అయ్యాక కూడా మహేష్ అందం చూసి ముసిరిపొయి, కళావతిగా కీర్తి సురేష్ ని పక్కనబెట్టేశారు. కానీ ఇప్పుడు సర్కారు వారి పాట ట్రైలర్ లో కీర్తి సురేష్ ని చూసి మహేష్ ఫాన్స్ కూల్ అవుతున్నారు. మరీ మనం ఊహించుకున్నట్టుగా ఏం లేదు, కీర్తి సురేష్ ని దర్శకుడు పరశురామ్ బాగానే చూపించారు అంటూ రిలాక్స్ అవుతున్నారు. అటు మహేష్ తో కీర్తి సురేష్ రొమాన్స్ కూడా హైలెట్ అవడంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక కీర్తి సురేష్ పెంగ్విన్, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా, రజిని అన్నాత్తే చిత్రాలు పోవడంతో ఆ రకంగానూ కంగారు పడిన ఫాన్స్.. సర్కారు వారి పాట ట్రైలర్ చూసాక ఆ భయాలు వదిలించుకుంటున్నారు.

Mahesh Fans are cool about Keerthy Suresh:

Mahesh Babu and Keerthy Suresh look perfect in Sarkaru Vaari Paata Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ