Advertisementt

పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యను

Mon 02nd May 2022 07:50 PM
bandla ganesh,pawan kalyan,cm pawan kalyan,hari hara veeramallu  పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యను
Bandla Ganesh Sensational Decision On Pawan Kalyan Movie పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యను
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని ప్రతి ఒక నిర్మాతకి, ప్రతి ఒక్క దర్శకుడికి ఉంటుంది. కొన్నేళ్ల వెయిటింగ్ తర్వాత దిల్ రాజు పవన్ తో వకీల్ సాబ్ చేసారు.. తన కల నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత మైత్రి వాళ్ళు, ఏఎం రత్నం ఇలా వరసగా పవన్ తో సినిమాలు చేస్తున్నారు. పవన్ తో సినిమా చేస్తే చాలు. అది ఎప్పుడైనా, ఎప్పటికైనా సరే.. ఇదే మేకర్స్ గోల్. కానీ ఇప్పుడొక కామెడీ నిర్మాత పవన్ తో సినిమా చెయ్యను అంటూ భారీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయనెవరో కాదు.. నా దేవుడు పవన్ కళ్యాణ్ అంటూ పూజించే బండ్ల గణేష్. గణేష్ గతంలో పవన్ తో సినిమాలు చేసాడు కూడా. ఇప్పుడు కూడా పవన్ తో ఓ సినిమా కమిట్మెంట్ ఉండనే ఉంది. అది దేవరా అనే సినిమా పవన్ తో చెయ్యాలని బండ్ల అనుకున్నాడు.

కానీ ఇప్పుడు బండ్ల గణేష్ పవన్ తో సినిమా చెయ్యను అంటున్నాడు. కారణం ఆయన పాలిటిక్స్ తోనూ, అటు నాలుగు ప్రోజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఆయన ఆ సినిమాల షూటింగ్స్ పూర్తి చెయ్యాలి. వాటిని పూర్తి చేసి అవకాశం ఇస్తే నేను ఆయనతో సినిమా చేస్తాను. నేను నాగార్జున సాగర్ లాంటి వాడిని, నీళ్లు వస్తాయి పోతాయి. ఫ్యూచర్ లో సినిమాలు చేస్తాను. సినిమాలంటే నాకిష్టం. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారితో సినిమా చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ త్వ‌ర‌గా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని కోరుకుంటున్నాను.. ముఖ్యమంత్రి అయితే ఆయన సినిమాలు చెయ్యడం కుదరదుగా అంటూ బండ్ల చెబుతున్న మాట. పవన్ అంటే నాకు ప్రాణం, ప్రేమ. నా ఫ్యామిలీని ఎంతగా పేమిస్తానో.. పవన్ ని అంతే ప్రేమిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల.

Bandla Ganesh Sensational Decision On Pawan Kalyan Movie:

Bandla Ganesh sensational comments about Pawan Kalyan 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ