Advertisementt

సర్కారు వారి పాట: జగన్ పై మహేష్ సెటైర్

Mon 02nd May 2022 04:25 PM
mahesh babu,keerty suresh,parasuram,sarkaru vaari paata,sarkaru vaari paata trailer,sarkaru vaari paata trailer review  సర్కారు వారి పాట: జగన్ పై మహేష్ సెటైర్
Sarkaru Vaari Paata Trailer released సర్కారు వారి పాట: జగన్ పై మహేష్ సెటైర్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు భారీ కటౌట్స్, ఆ కటౌట్ కి పాలాభిషేకాలు, ఫాన్స్ హంగామా మధ్యన సర్కారు వారి పాట ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మెయిన్ రోడ్ దగ్గర నుండి ఆ థియేటర్ దగ్గరకి వెళ్లే రోడ్ మొత్తం మహేష్ అభిమానులతో నిండి పోయింది. సూపర్ స్టార్, జై బాబు, జై బాబు, మహేష్ అంటూ పేపర్స్ చింపి పైకి ఎగరేస్తూ ఫాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ పోకిరి స్టయిల్లో నటించిన సర్కారు వారి పాట ట్రైలర్ వచ్చేసింది. గత నాలుగైదురోజులుగా సర్కారు వారి పాట ట్రైలర్ కోసం ఇస్తున్న అప్ డేట్స్, పోస్టర్స్ అన్ని ట్రైలర్ పై అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేస్తున్నాయి. మహేష్ తాళాల గుత్తితో చేసే యాక్షన్ సీక్వెన్స్ కోసం.. ఆయన మాసివ్ లుక్ కోసం మహేష్ ఫాన్స్ వెయిటింగ్ వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో సర్కారు వారి పాటని ట్రెండ్ చేస్తున్నారు.

సర్కారు వారి పాట ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం 4.5 నిమిషాలకు రిలీజ్ చేసారు.

ట్రైలర్ లోకి వెళితే మహేష్ బాబు రఫ్ గా స్టైలిష్ గా, ఫైట్ సీక్వెన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు అందంగా స్టైలిష్ గా, మాస్ గా కనిపిస్తూనే కామెడీగా చెప్పే డైలాగ్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. కీర్తి సురేష్ కోసం మహేష్ మెలికలు తిరిగిపోవడం, వెన్నెల కిషోర్ వచ్చి అమ్మాయి కోసం మీరిలా దిగజారిపోవడం ఏమిటి సర్ అంటాడు. కీర్తి సురేష్ తో మహేష్ నేను విన్నాను, నేను వున్నాను అనగానే ప్రస్తుత ఏపీ సీఎం జగన్ గతంలో ఏపీ పాదయాత్రలో చెప్పిన డైలాగ్ పుసుక్కున గుర్తిచేసింది. అక్కడ మహేష్ జగన్ పై సెటేరికల్ గా డైలాగ్ చెప్పారనిపించింది. తర్వాత మీరింకా చిన్నపిల్లాడు సర్ అని వెన్నెల కిషోర్ అనగానే అవును అందరూ అలానే అంటున్నారు.. దీనెమ్మ మెయింటింగ్ చెయ్యడానికి దూలతీరిపోతుంది అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇక సముద్ర ఖనితో డైలాగ్ వార్, బీచ్ ఫైట్ అయితే మహేష్ ఫాన్స్ కి పూనకాలే. నదియా ఓ సీన్ లో కనిపించగా.. మధ్యలో కళావతి సాంగ్ తో మెస్మరైజ్ చేసారు. 

మహేష్ బాబు లుక్, ఆయన చెప్పిన కామెడీ డైలాగ్స్, కీర్తి సురేష్ లుక్స్, విలన్స్ గా సముద్రఖని.. అందరూ అద్భుతంగా పెరఫార్మెన్స్ చెయ్యగా.. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాటని కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా చూపించడమే కాదు.. మహేష్ ఫాన్స్ తో థియేటర్స్ లో విజిల్స్ వేయించేలా ఉంది ఈ ట్రైలర్.

సర్కారు వారి పాట ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Sarkaru Vaari Paata Trailer released :

Sarkaru Vaari Paata Trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ