నిన్న ఆదివారం విశ్వక్ సేన్ ఫాన్ ఒకరు మీద పెట్రోల్ పోసుకుని తనకి పెళ్లి కావడం లేదు అంటూ నడి రోడ్డు మీద హంగామా చేస్తూ విశ్వక్ సేన్ కారు ముందు పడుకుని చచ్చిపోతా అంటూ హడావిడి చెయ్యగా దానికి విశ్వక్ సేన్.. మీ ప్రశ్నలకి సమాధానాలు మే 6 తెలుస్తాయంటూ.. అదో ఫ్రాంక్ వీడియో గా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ ఇలాంటి ప్రాంక్ వీడియో చెయ్యగా.. దానిని చాలామంది నెటిజెన్స్ నుండి వ్యతిరేఖత వచ్చింది. ఇలాంటి వీడియోస్ వలన యూత్ చెడిపోతారంటూ విశ్వక్ సేన్ ని తిడుతున్నారు. లాయర్ అరుణ్ కుమార్ అనే వ్యక్తి అయితే విశ్వక్ సేన్ పై HRC లో కంప్లైంట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
అదే ప్రాంక్ వీడియో విషయంలో TV9 లో డిబేట్ పెట్టారు. ఆ డిబేట్ లో లాయర్ అరుణ్, నటుడు చిట్టిబాబు లాంటి వారు డిబేట్ లో పాల్గొనగా, యాంకర్ దేవి ఈ డిబేట్ ని నడిపిస్తూ విశ్వక్ సేన్ చేసింది తప్పు అంటూ వాదిస్తుంది. అలా ప్రాంక్ వీడియో చేసిన వారిపై కేసు నమోదైంది అంటూ చిట్టిబాబు గారికి చెప్పింది. చిట్టిబాబు గారు మాత్రం విశ్వక్ సేన్ చిన్న సినిమా, తన సినిమా బ్రతికించుకోవడానికి అలా చేసారు. అందులో ఉన్నది పెట్రోల్ కాదు, వాటర్ అని చెప్పారు. అది తప్పు కాదు అంటున్నారు. కానీ దేవి మాత్రం అది వాటర్ అనేది ఇప్పుడు చెబితే తెలిసింది.. కానీ ఇలాంటివి జరక్కుండా చూడాలి. అయ్యో ప్రాణం పోయాక పోయింది అనుకునే కన్నా.. ప్రాణం పోకుండా చూడాలి అంది. ఇక దేవి ఓ బొమ్మ తుపాకీ తీసుకుని రోడ్డు మీదకి వచ్చినా అది భయమేనని, కానీ ఇలాంటి వాటర్ ని పెట్రోల్ అంటూ చెయ్యడం చాలా తప్పు అని దేవి మాట్లాడుతుంది.
కానీ విశ్వక్ సేన్.. మా సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాం, పెట్రోల్ తో చెయ్యలేదు, వాటర్ తో ప్రాంక్ చేసాం. అది తప్పేలా అవుతుంది. ప్రాంక్ లు చేస్తే ఎంజాయ్ చెయ్యాలి ఈ కేసులేమిటి అంటూ విశ్వక్ సేన్ అటు డిబేట్ పెట్టిన TV9 పైన, ఇటు లాయర్ అరుణ్ కుమార్ పైన ఫైర్ అవుతున్నారు.