Advertisementt

విడాకులపై సుమ కనకాల పక్కా క్లారిటీ

Mon 02nd May 2022 11:06 AM
anchor suma,suma kanakala,divorce,rajeev kanakala,jayamma panchayiti  విడాకులపై సుమ కనకాల పక్కా క్లారిటీ
Suma Gives Clarity About Her Divorce With Rajeev విడాకులపై సుమ కనకాల పక్కా క్లారిటీ
Advertisement
Ads by CJ

సుమ నటించిన జయమ్మ పంచాయితీ రేపు శుక్రవారమే రిలీజ్ కాబోతుంది. ఎవ్వరూ ఏ సినిమాకి చెయ్యని ప్రమోషన్స్ ని సుమ ఈ సినిమాకి చేస్తూ వస్తుంది. బుల్లితెర మీద నెంబర్ వన్ యాంకర్ గా చక్రం తిప్పుతున్న సుమ వెండితెర మీదకి జయమ్మ పంచాయితీతోనే రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే సుమకి ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె రోల్, ఆ కథ, వగైరా వగైరాల గురించి అడక్కుండా ఆమె రాజీవ్ కి విడాకులు ఇవ్వాలనుకుంది అనే మేటర్ ని హైలెట్ చేస్తూ వస్తుంది మీడియా. సుమని ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. 

అయితే తాజాగా సుమ విడాకుల విషయం పక్కాగా ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసింది. రాజీవ్ కనకాలతో తన పెళ్ళై 23 ఏళ్ళు అయ్యింది అని.. చిన్న చిన్న గొడవలు ఏ కాపురంలో అయినా వస్తాయని, తాము ఈ 23 ఏళ్లుగా చాలా హ్యాపీ గా ఉన్నామని, తమకు సోషల్ మీడియా ఎప్పుడో విడాకులు కాదు, చాలాసార్లు విడాకులు ఇప్పించింది అని, ఇలాంటి రూమర్స్ ఎన్నింటికి తాము జవాబులు ఇవ్వగలమని, అందుకే ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు రాజీవ్ తో కలిసి ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ మేటర్ కి ఫుల్ స్టాప్ పెడతా అని చెప్పిన సుమ.. తమ పిల్లలు కూడా ఈ రూమర్స్ ని లైట్ తీసుకుంటారని, మరి స్కూల్ లో ఎవరైనా ఇలాంటి విషయాలు అడిగితే ఏం చెబుతారని వాళ్ళని అడిగితే ఏం చెప్పాలో మాకు తెలుసు అంటూ ఈజీగా ఉంటారంటూ సుమ విడాకుల విషయాన్ని తెగ తెంపులు చేసేసింది. 

Suma Gives Clarity About Her Divorce With Rajeev:

Anchor Suma Gives Clarity About Her Divorce With Rajeev

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ