Advertisementt

ఆచార్య పనైపోయింది.. నెక్స్ట్ ఏంటి

Mon 02nd May 2022 10:09 AM
ram charan,acharya,rc 15 update,shankar,rc 15,kiara advani  ఆచార్య పనైపోయింది.. నెక్స్ట్ ఏంటి
RC 15 update ఆచార్య పనైపోయింది.. నెక్స్ట్ ఏంటి
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ఆచార్య గత శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. చిరు - చరణ్ మ్యాజిక్ చెయ్యకపోయినా మెగా ఫాన్స్ కి నచ్చేలా సినిమా ఉండడంతో.. యావరేజ్ టాక్ తోనే ఆచార్య థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇక ఆచార్య ప్రమోషన్స్ కోసం ఓ పది రోజుల పాటు రామ్ చరణ్ శంకర్ RC15 షూటింగ్ కి విరామం ఇచ్చాడు. పంజాబ్ లోని అమృత్ సర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని చరణ్ నేరుగా ఆచార్య ప్రమోషన్స్ లోకి దిగిపోయారు. అయితే ఆచార్య ప్రమోషన్స్ అయ్యాయి. సినిమా రిలీజ్ అయ్యింది. ఆ పని పూర్తవడంతో నెక్స్ట్ ఏమిటి చరణ్ అంటే.. ఇంకేముంది శంకర్ మూవీనే అంటున్నారట. అంటే శంకర్ తో చేస్తున్న మూవీ కొత్త షెడ్యూల్ కి ప్రిపేర్ అవడమే.

ఆచార్య రిలీజ్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని చిరు ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్లిపోగా.. చరణ్ మాత్రం మే సెకండ్ వీక్ నుండి శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ వైజాగ్ లో మొదలు కాబోతున్నట్లుగా టాక్. ఈ షెడ్యూల్ లో సినిమాలో కీలక పాత్రధారులు పాల్గొంటారని, హీరోయిన్ కియారా అద్వానీ దగ్గరనుండి విలన్ పాత్రధారి, అలాగే శ్రీకాంత్, అంజలి ఇలా కీలక నటులంతా ఈ షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. 

RC 15 update :

Ram Charan RC 15 update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ