ఇప్పుడు చాలామంది యాడ్స్ లో నటించాలంటే ఆలోచించి అడుగులు వేస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన రాపిడో, జొమాటో యాడ్స్ కాంట్రవర్సీ అయ్యాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ పాన్ మసాలా యాడ్ తనవద్దకు వస్తే చెయ్యనని నిర్మొహమాటంగా చెప్పేసాడు. పారితోషకం భారీగా ఇస్తా వద్దన్నాడు. అదే యాడ్ లో నటించిన అక్షయ్ కుమార్ ఆఖరికి సారి చెప్పి ఆ యాడ్ నుండి వైదొలిగాడు. అక్షయ్ కుమార్ పాన్ మసాలా యాడ్ లో నటించడంతో ఆయనపై నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేసారు.. దానితో అక్షయ్ సారి చెప్పాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు ఈ పాన్ మసాలా యాజమాన్యం పాన్ ఇండియా స్టార్ యశ్ దగ్గరికి వెళ్లిందట. కెజిఎఫ్ చాప్టర్ 2 తో కోట్లు కొల్లగొట్టడమే కాక విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న యశ్ ని పాన్ మసాలా కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే భారీ పారితోషకం ఇస్తామని అడిగారట. కానీ యశ్ ఇలాంటి యాడ్స్ లో తాను నటించలేను అని, ఇలాంటివి చేస్తే ఫాన్స్ నన్ను చూసి వాళ్ళు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అంటూ పాన్ మసాలా యాడ్లో నటించను అని చెప్పేశాడట. మొన్న అల్లు అర్జున్, నిన్న అక్షయ్ కుమార్, నేడు యశ్.. పాన్ మసాలా వాళ్ళకి ఝలక్ ఇచ్చారు.