ఆచార్య సినిమా మొదలైనప్పుడు ఆచార్య ని పాన్ ఇండియా లెవల్లో అంటే ముఖ్యంగా హిందీలో రిలీజ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆచార్య ట్రైలర్ వచ్చేవరకు ఆ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతున్నట్టే అనుకున్నారు. కానీ ఆచార్య ట్రైలర్ తర్వాత ఈ సినిమా హిందీలో రిలీజ్ అవుతుందో లేదో అనే కన్ఫ్యూషన్ లో పడేసారు మేకర్స్. అయితే కొరటాల శివ ఆచార్య ప్రమోషన్స్ లో ఆచార్య ని హిందీలో రిలీజ్ చేద్దామనుకున్నాం, మారుతున్న పాన్ ఇండియా సమీకరణలతో ఆచార్య కూడా హిందీలో విడుదల చేస్తే బావుంటుంది అనుకున్నాం కానీ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకోలేదు అన్నారు. రామ్ చరణ్ ముందు ఇక్కడ రిలీజ్ చేసాక తర్వాత హిందీలో చేస్తాం.. ఒకేసారి రిలీజ్ చెయ్యడానికి పోస్ట్ ప్రొడక్షన్ కి టైం లేదు అన్నాడు.
అయితే ఆచార్య ని డబ్ చేసి హిందీలో రిలీజ్ చేసినట్టైయితే ఈ టాక్ తో పరువుపోయేది అంటున్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్ 2 అదిరిపోయే హిట్స్ తో హిందీ బాక్సాఫీసుని షేక్ చేసిన టైం లో అక్కడి హీరోలు సౌత్ పై సంచలన కామెంట్స్ చేస్తున్న సమయంలో ఆచార్య ని గనక హిందీలో రిలీజ్ చేసినట్లయితే ఆ సినిమా అక్కడ కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంటే.. హిందీ నటులకి చక్కటి ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యేది. ఇలా మేకర్స్ టైం లేదంటూ హిందీలో రిలీజ్ చేయకపోవడమే మంచిదైంది అంటూ ఇప్పుడు మెగా ఫాన్స్ మాట్లాడుకుంటున్నారంటే.. ఆచార్య పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది.