ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Interesting update on Hari Hara Veera Mallu

హరి హర వీరమల్లులో అదే హైలెట్ అంట

Interesting update on Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో ప్రస్తుతం సెట్స్ మీదున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కి చిన్నపాటి బ్రేక్ ఇచ్చారు. మొన్నటితో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న హరి హర వీరమల్లు తదుపరి షెడ్యూల్ ఈ వారంలో మొదలు కాబోతుంది. భారీ గా సెట్స్ నిర్మించి అందులోనే చిత్రీకరణ చేపట్టారు క్రిష్. పవన్ కూడా హరి హర వీరమల్లు కోసం యుద్ధ విద్యలు, యాక్షన్ సన్నివేశాల కోసం మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో కలిసి ట్రైనింగ్ తీసుకుని మరీ కొత్త షెడ్యూల్ కి ఎంటర్ అయ్యారు. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్ లో పవన్ పై యాక్షన్ ఘట్టాలని చిత్రీకరించింది టీం.

కొత్తగా మొదలు కాబోయే హరి హర వీరమల్లు షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ ఒకేసారి వెయ్యిమంది యోధులతో ఫైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే ఆ యాక్షన్ సీన్ సినిమా మొత్తంలో హైలెట్ గా నిలుస్తుంది అని, ఒకవైపు చారిత్రాత్మక అంశాలను హైలెట్ గా చూపిస్తూనే పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్టుగా ఆయన ఫ్యాన్స్ ఇష్టపడే ఎలివేషన్స్ కూడా సినిమాలో హైలెట్స్ గా నిలవబోతున్నాయని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తో వరస విజయాలతో ఊపులో ఉన్నారు. ఇప్పుడు హరి హర వీరమల్లు కూడా పాన్ ఇండియాలో ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. 

Hari Hara Veera Mallu Movie Update

hari hara veera mallu movie
pawan kalyan
krish
hari hara veera mallu movie update