ఎన్నడూ లేనిది నైజాం హక్కులు ఈసారి దిల్ రాజు చేజారిపోయాయి. అటు నిర్మాతగానే కాకుండా ఇటు డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు నైజాం లో నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు. ఈమధ్యనే ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్ లతో భారీ హిట్ కొట్టి పార్టీ చేసుకున్న దిల్ రాజు తో మరో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆధిపత్యం కోసం పోరాడాడు. అందుకే ఆచార్య విషయంలో మేకర్స్ ఈసారి దిల్ రాజు కి కాకుండా వరంగల్ శ్రీను ఎక్కువ మొత్తం కోట్ చెయ్యడంతో నైజాం డిస్ట్రిబ్యూషన్ వరంగల్ శ్రీను కి కట్టబెట్టారు. అప్పట్లో రిలీజ్ డేట్స్ విషయంలో దిల్ రాజు ఎఫ్ 3, ఆచార్య పోటీపడినట్లే కనిపించినా తర్వాత రామ్ చరణ్ తంత్రం పని చెయ్యడంతో దిల్ రాజు ఎఫ్ 3 తో వెనక్కి తగ్గారు.
ఇలా దిల్ రాజు కి వరంగల్ శ్రీనుకి మధ్యన చాలా గొడవలే జరిగాయి. తనకి ఆచార్య హక్కులు రాకుండా చాలామంది ట్రై చేసారని కానీ 42 కోట్లకి ఆచార్య హక్కులు ద్కకించుకున్నట్టుగా వరంగల్ శ్రీను ఆచార్య రిలీజ్ టైం లో యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇచ్చాడు. మరి అంత పెట్టి, అంత గొడవపడి కొన్న ఆచార్య మూవీకి నైజాం లో కలెక్షన్స్ వస్తాయా.. ఆచార్య నైజాం లో గట్టెక్కుతుందా అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆచార్య కి మిక్స్డ్ టాక్ పడడంతో.. రోజు రోజుకి ఆచార్య కలెక్షన్ పడిపోతున్నాయి. దానితో ఆచార్య సర్కారు వారి పాట వచ్చేవరకు 42 కోట్లు నైజాం లో వెనక్కి తేవడం సానా కష్టంగానే మారింది. వరంగల్ శ్రీను దిల్ రాజు తో చేసిన పోరాటం మాత్రం ఫలించేలా కనిపించడం లేదు.