Advertisementt

సర్కారు వారి పాట ట్రైలర్ కూడా లీకైందా

Sun 01st May 2022 04:40 PM
mahesh babu,sarkaru vaari paata,sarkaru vaari paata trailer,parasuram,keerthy suresh  సర్కారు వారి పాట ట్రైలర్ కూడా లీకైందా
Sarkaru Vaari Paata Trailer Leaked? సర్కారు వారి పాట ట్రైలర్ కూడా లీకైందా
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కలయికలో రిలీజ్ కి సిద్దమవుతున్న సర్కారు వారి పాట విషయంలో లీకులు టీం ని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. కళావతి సాంగ్ రిలీజ్ చేస్తున్నామంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలోపే ఆ సాంగ్ సోషల్ మీడియాలో లీకైపోయింది. దానితో ఆ సాంగ్ రిలీజ్ అవ్వాల్సిన టైం కన్నా ముందే రిలీజ్ చేసారు. థమన్ అయితే ఏడ్చేశాడు. ఇక పెన్నీ సాంగ్ విషయంలోనూ అదే జరిగింది. మహేష్ మేకర్స్ కి గట్టిగా చెప్పాడని, ఇకపై సర్కారు వారి పాట లీక్స్ ఉండవని అన్నారు. థమన్ తాజా ఇంటర్వ్యూలోను లీకు వీరుణ్ణి పట్టుకున్నాం, బట్ అతని కెరీర్ పోతుంది అని కేసు పెట్టలేదన్నాడు.

ఇక ఇప్పుడు రేపు రిలీజ్ కాబోయే సర్కారు వారి పాట ట్రైలర్ నుండి కూడా కొన్ని సీన్స్ లీకైనట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ట్రైలర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరే మొబైల్ తో వీడియో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ట్రైలర్ లోని మహేష్ బాబు చేతిలో తాళాల గుత్తి పట్టుకుని విలన్స్ ను చితక్కొడుతున్న సీన్ వైరల్ గా మారుతోంది. దానితో మేకర్స్, టీం కూడా తలలు పట్టుకున్నారని తెలుస్తుంది. మరి సర్కారు వారి పాట నుండి అప్ డేట్ వస్తుంది అని ఎగ్జైట్ అయ్యేలోపే ఇలాంటి న్యూస్ లతో మహేష్ ఫాన్స్ డిస్పాయింట్ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు.

Sarkaru Vaari Paata Trailer Leaked?:

Mahesh babu Sarkaru Vaari Paata Trailer Leaked?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ