నేచురల్ బ్యూటీగా యంగ్ హీరోల సరసన నటించడమే కాదు, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, పెరఫార్మెన్స్ పరంగాను, డాన్స్ విషయంలోనూ ప్రత్యేకతని చాటిన సాయి పల్లవి పేరు ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. గత ఏడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ తర్వాత విరాట పర్వం మూవీతో హైలెట్ అవ్వుద్ది అనుకుంటే.. ఆ విరాట పర్వానికి మోక్షం లేదు. నటనతోనే హీరోల పక్కన నెంబర్ వన్ అనిపించుకున్న సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో ఏ హీరో సరసన సినిమా చెయ్యడం లేదు.
అంటే ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. గ్లామర్ షో చెయ్యదనా? లేదంటే ఆమె పక్కన ఉంటే తాము కనబడమనో, స్టార్ హీరోల సంగతో ఎలా ఉన్నా.. ఇప్పుడు యంగ్ హీరోలు కూడా సాయి పల్లవికి ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. శ్యామ్ సింగ రాయ్ లో అద్భుతమైన డాన్స్, పెరఫార్మెన్స్ తో అదిరిపోయేలా కనబడిన సాయి పల్లవి కి ఛాన్స్ లు లేకపోవడం నిజంగా విచిత్రమే. కనీసం సాయి పల్లవి వార్తల్లో కూడా నిలవడం లేదు. అదే ఛాన్స్ లు కోసం చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ హంగామా చేసేవారు. కానీ సాయి పల్లవి అలాంటి ప్రయత్నం ఏం చెయ్యదు. ఆఫర్ వస్తే చేస్తుంది. లేదంటే సైలెంట్ గా ఉంటుంది. కానీ టాలెంట్ ఉన్న సాయి పల్లవి ఖాళీగా ఉండడం ఆమె ఫాన్స్ కి నచ్చడం లేదు.