చిరంజీవి కం బ్యాక్ మూవీస్ లో ఖైదీ నెంబర్ 150 అంటే అది రీమేక్ కాబట్టి నడిచేసింది. ఇక సైరా నరసింహ రెడ్డి పర్లేదు అనిపించింది. కానీ ఇప్పుడు ఆచార్య మాత్రం పెట్టిన బడ్జెట్ తేవడం కష్టంగా మారింది. ఆచార్య సినిమాలో చిరు లుక్ కానీ, ఆయన పెరఫార్మెన్సు కానీ మెగా ఫాన్స్ కే రుచించలేదు. ఆచార్య లో సిద్ద కేరెక్టర్ లేకపోతె పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది అనేది మెగా ఫాన్స్ మాట. ఆ సినిమాలో చిరు కి రొమాన్స్ లేకపోవడం మైనస్ అని, అలాగే ఫైట్స్ లో జోష్ లేదు, పాటలతో సినిమా హిట్ అవదు, మ్యూజిక్ లో మ్యాజిక్ లేదు, కొరటాల పెన్ లో పవర్ లేదు.. ఇలా ఆచార్య పోవడం వెనుక కారణాలను చిలవలు పలవలుగా చేసి రాస్తున్నారు విమర్శకులు.
అయితే ఆచార్య ఫలితం ఇప్పుడు ఆయన చేస్తున్న నెక్స్ట్ మూవీస్ పై పడడమే కాదు.. ఆయా దర్శకులపై పడుతుంది. మోహన్ రాజా గాడ్ ఫాదర్, మెహెర్ రమేష్ భోళా శంకర్, బాబీ మెగా 154, వెంకీ కుడుముల సినిమాపై ఖచ్చితంగా ఆచార్య ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి.. వాళ్ళు చాలా ఒత్తిడి ఫీలవడం గ్యారెంటీ. అటు మెగా ఫాన్స్ కూడా ఈసారి చిరు ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంటారు. సో ఆచార్య తర్వాత రాబోయే సినిమాలపై విపరీతమైన అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలు అందుకోవడానికి చిరు తో పని చేసే దర్శకులు కష్టపడాల్సిందే.