బిగ్ బాస్ తొమ్మిదోవారం పూర్తి చేసుకోవడానికి జస్ట్ ఒక్క అడుగు తేడాతో ఉంది. రేపు ఆదివారంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని పదవ వారంలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యింది. ఇప్పటివరకు చాలా గొడవలు, నామినేషన్స్ లో వాదోపవాదనలు జరగడమే కాదు.. స్ట్రాంగ్ అనుకున్న ఒక్కో కంటెస్టెంట్స్ హౌస్ ని వీడుతూ వచ్చారు. అలా తేజస్వి, ఆర్జే చైతు, అజయ్, మహేష్ విట్టా ఉండగా.. ఇకపై ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో అనే విషయంలో ప్రేక్షకులు చాలా క్యూరియాసిటీగా ఉంటున్నారు. మిత్ర శర్మ ఎపుడో ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే.. ఆమె వారం వారం సేవ్ అవుతూనే వస్తుంది.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న యాంకర్ శివ, నటరాజ్, బాబా భాస్కర్, హమీద, అరియనా, మిత్ర శర్మ, అనిల్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం ఓటింగ్ లో మిత్ర శర్మ టాప్ ప్లేస్ లో ఉండగా.. యాంకర్ శివ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడట. తర్వాత స్థానాల్లో బాబా భాస్కర్ మూడో స్థానంలో, నటరాజ్ మాస్టర్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారట. ఇక ఫైనల్ గా డేంజర్ జోన్ లో అరియనా, హమీద, అనిల్ ఉండగా.. ఈ వారం హమీద ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడినట్లుగా తెలుస్తుంది. అనిల్ - హమీద మధ్యన ఓటింగ్ లో పోటీ నడిచినా చివరికి హమీద అవుట్ అయినట్లుగా తెలుస్తుంది. బిగ్ బాస్ ఐదో సీజన్ లో ఐదో వారం ఎలిమినేట్ అయిన హమీద.. నాన్ స్టాప్ లో తొమ్మిదో వారం ఎలిమినేట్ అయ్యింది. ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ రేపు ఆదివారం ప్రసారం కాబోతుంది.