బాలకృష్ణ అఖండ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ కొట్టెయ్యడమే కాదు.. అన్ స్టాపబుల్ అంటూ అదిరిపోయే టాక్ షో తో ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు. తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 చేస్తున్నారు. ప్రస్తుతం NBK 107 షూటింగ్ లో పాల్గొంటున్న బాలకృష్ణ తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చెయ్యబోతున్నారు. అనిల్ రావిపూడి ఈసారి తన మార్క్ కామెడీ ని పక్కనబెట్టి బాలయ్య ని ఎలా చూపిస్తే ఫాన్స్ మెచ్చుతారో అలానే చూపిస్తాను అంటూ.. ఈమధ్యన బాలయ్య తో తాను చెయ్యబోయే సినిమాపై అంచనాలు పెంచేశారు.
తాజాగా మరోమారు బాలకృష్ణ తో తాను చెయ్యబోయే సినిమా తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ బాలయ్య సినిమాపై ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంట్వ్యూలో మట్లాడారు అనిల్ రావిపూడి. అలాగే బాలయ్యతో తాను చెయ్యబోయే కథలో ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అని.. అదొక డిఫ్రెంట్ జోనర్ లో తెరకెక్కబోయే సినిమా అంటూ అనిల్ రావిపూడి బాలయ్య తో చేసే సినిమాపై చిన్నపాటి అప్ డేట్ ఇచ్చాడు. అంతేకాకుండా మహేష్ తో మరోమూవీ చెయ్యడానికి రెడీగా ఉన్నాను అని, ఆయన తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసే లోపల ఓ అద్భుతమైన కథని రెడీ చేసి, స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాను, మహేష్ తో మిషన్ ని ఆయన ప్రోజెక్ట్స్ పూర్తి కాగానే మొదలు పెట్టేస్తా అంటూ చెప్పారు.