Advertisementt

NBK 107 టైటిల్ ఫిక్స్ అంటున్నారు

Sat 30th Apr 2022 04:16 PM
nbk 107,balakrishna,gopichand malineni,sruthi haasan  NBK 107 టైటిల్ ఫిక్స్ అంటున్నారు
NBK 107 Title Fixed? NBK 107 టైటిల్ ఫిక్స్ అంటున్నారు
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో పవర్ ఫుల్ కథ తో NBK 107 ఈ జనవరిలో సెట్స్ మీదకు వెళ్ళింది. తెలంగాణలోని సిరిసిల్ల లో షూటింగ్ మొదలు పెట్టిన టీం.. ప్రస్తుతం హైదరాబాద్ సారధి స్టూడియో లో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ చేస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్ ఫాన్స్ కి మాత్రమే కాదు.. మాస్ ఆడియన్స్ అందరికి తెగ నచ్చేసింది. బ్లాక్ షర్ట్ లో బాలయ్య ఫ్యాబ్యులస్ లుక్ నిజంగా అద్భుతంగా అనిపించింది. అయితే ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నారు.. ఒక రోల్ లో పవర్ ఫుల్ గా మాస్ గా కనిపిస్తున్న బాలకృష్ణ మరో కెరీక్టర్ లో స్టైలిష్ గా కనిపించబోతున్నారట. ఆ కేరెక్టర్ కోసం శృతి హాసన్ ని హీరోయిన్ గా దింపారు గోపీచంద్.

ఇక NBK 107 టైటిల్ గా రెండు టైటిల్స్ ని అనుకుంటున్నారట. అందులో అన్నగారు టైటిల్ ఒకటి, రెండోది వీర సింహారెడ్డి అని.. ఈ రెండిటిలో వీర సింహారెడ్డి అనేది బాలయ్య కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని, రెడ్డి సెంటిమెంట్ కూడా కలిసొస్తుంది అని ఫాన్స్ అంటుంటే.. ఎక్కువమంది అన్నగారు టైటిల్ కె మొగ్గు చూపుతున్నారట. అయితే రెండిటిలో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ చేసి మంచి ముహూర్తాన రివీల్ చెయ్యాలని మేకర్స్ అనుకుంటున్నారట.

NBK 107 Title Fixed?:

Nandamuri Balakrishna NBK 107 Title Fixed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ