Advertisementt

వెంకీ-సల్మాన్ ఫిక్స్, విలన్ ఎవరంటే

Sat 30th Apr 2022 12:32 PM
salman khan,venkatesh,versatile actor,  వెంకీ-సల్మాన్ ఫిక్స్, విలన్ ఎవరంటే
Jagapathi Babu to lock horns with Salman and Venkatesh? వెంకీ-సల్మాన్ ఫిక్స్, విలన్ ఎవరంటే
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా వెంకటేష్ - సల్మాన్ ఖాన్ కలయికలో ఓ మూవీ తెరకెక్కడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వంలో సల్మాన్‌ - వెంకటేష్​ తో కలిసి పూజా హెగ్డే నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ మాత్రం మే 11 న ముంబై లో పూజా కార్యక్రమాలతో మొదలు కావడమే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళిపోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే వెంకటేష్ రానా - నాయుడు షూటింగ్ కోసం తరచూ ముంబై వెళుతున్నారు.

అయితే వెంకీ - సల్మాన్ ఖాన్ మూవీ లో విలన్ కూడా ఫిక్స్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆయనే టాలీవుడ్ స్టైలిష్ విలన్ జగపతి అంట. జగపతి బాబు విలన్ గా తెలుగు, తమిళ, మలయాళం అంటూ దున్నేస్తున్నారు . ఇప్పుడు వెంకీ కోసం హిందీ మూవీకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. కబీ ఈద్‌ కబీ దీవాలి అనే టైటిల్ కూడా ఫిక్స్ చెయ్యడమే కాకుండా ఈ సినిమా కి రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారట. ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ 30 న కబీ ఈద్‌ కబీ దీవాలి విడుదలకు సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.

Jagapathi Babu to lock horns with Salman and Venkatesh?:

Versatile actor along with Salman Khan-Venkatesh?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ