మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాల విషయంలో కొరటాలని మెచ్చుకున్న వారు ఇప్పుడు ఆచార్య విషయంలో తిట్టుకుంటున్నారు. కారణం ఆ సినిమాలో కథ లేకపోవడం, కనీసం హీరోల ఎలివేషన్స్ బాగాలేకపోవడం. మహేష్ కి రెండు హిట్స్, ప్రభాస్ కి ఓ హిట్, ఎన్టీఆర్ కి హిట్ ఇచ్చిన కొరటాల ఇప్పుడు చిరు, చరణ్ కి హోల్సేల్ గా షాకిచ్చారనేది మెగా ఫాన్స్ అభిప్రాయం. కొరటాల రైటింగ్ స్కిల్స్ కూడా ఏ మాత్రం నచ్ఛలేదు అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఆచార్య విషయంలో కొరటాల తప్పు లేదంటూ కొన్ని వాదనలు తెరపైకి వచ్చాయి.
భరత్ అనే నేను తర్వాత కొరటాల టార్గెట్ రామ్ చరణ్. అలా మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టి కథతో రామ్ చరణ్ ని మెప్పించేలోపు ట్రిపుల్ ఆర్ కథ తో రాజమౌళి లైన్ లోకి రావడంతో చరణ్ కొరటాలని వదిలి రాజమౌళి వైపు వెళ్లిపోవడంతో.. చిరు లైన్ లోకి వచ్చి కొరటాల తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఆ మాట చిరునే చెప్పారు. అయితే కొరటాల చరణ్ కి తెచ్చిన కథ పక్కనబెట్టి చిరు కోసం కథ రాయగా.. ఆ కథలో చిరు చెప్పిన మార్పులు చేర్పులు కాదనలేక ఆ స్టోరీ కాస్త అటు ఇటుగా మార్చి, చరణ్ రోల్ ఇరికించి.. ఆ రోల్ ని మళ్ళీ చిరు చెప్పారని పెంచి అలా గందరగోళంలో ఆచార్య రెడీ అయ్యింది అని, కొరటాల అనుకున్నది వేరు.. మెగాస్టార్ చెప్పింది చేసిన కొరటాల వేరు అంటూ ఒక కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.