నిన్నటివరకు ఎన్టీఆర్ ఫాన్స్ చాలా ఆందోళనలో, ఆగ్రహంతో ఉన్నారు. కారణం ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ ని హైలెట్ చేసి, రామ్ చరణ్ ని ఎలివేట్ చేసి రాజమౌళి ఎన్టీఆర్ కి అన్యాయం చేసారు. అలాగే రాజమౌళి ఎక్కడ చూసినా రామ్ చరణ్ గొప్ప నటుడు, తండ్రి మెగాస్టార్ అయినా తన స్వశక్తితో చరణ్ ఎదిగాడు అంటూ చెప్పడంతో ఎన్టీఆర్ ఫాన్స్ రాజమౌళి పై చాలా కోపం గా ఉన్నారు. మరోపక్క రామ్ చరణ్ కి ఎక్కువ ఇంపోర్టన్స్ ఇచ్చారని చరణ్ పైన కూడా ఎన్టీఆర్ ఫాన్స్ గుర్రుగానే ఉన్నారు.
రాజమౌళి ఎంతగా నచ్చ చెప్పినా ఫాన్స్ లో మాత్రం ఆ భావన అలాగే ఉండిపోయింది. అయితే నిన్న శుక్రవారం రిలీజ్ అయిన ఆచార్య మూవీ కి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో చరణ్ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు. కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం శాంతించారు. రాజమౌళి తెగ ఎత్తేసారు. కానీ ఇప్పుడేం జరిగిందో చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్య కొచ్చిన టాక్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషీగా లేకపోయినా.. తమలోని ఈగో మాత్రం శాటిస్ ఫై అయినట్లే కనిపిస్తుంది.