సర్కారు వారి పాట ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. మే 12 న రిలీజ్ కాబోతున్న సర్కారు వారి పాట ట్రైలర్ ని మే 2 న రిలీజ్ చేస్తున్నారు. ఈలోపు ఆర్ట్ డైరెక్టర్, దర్శకుడు పరశురామ్, కీర్తి సురేష్ లు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. కొన్ని ఛానల్స్ కి పరశురామ్, కీర్తి సురేష్ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తుంటే.. కీర్తి సురేష్ సోలో ఇంటర్వూస్ కూడా ఇచ్చేస్తుంది. అయితే ఇవన్నీ సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ చేసే ఇంటర్వూస్. అయినప్పటికీ ఆ ఇంటర్వూస్ పిక్స్ సోషల్ మీడియా లో షేర్ అయ్యి వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూ లో కీర్తి సురేష్ గతంలోలా ట్రెడిషనల్ గాను, స్టయిల్ గాను హాజరవడం లేదు.
కళావతి చాలా గ్లామర్ గా చిట్టి పొట్టి డ్రెస్సులతో అందాలు ఆరబోసేస్తుంది. గతంలో ట్రెడిషనల్ గర్ల్ గా ప్రొజెక్ట్ అయిన కీర్తి సురేష్ ఈ మధ్యన స్టయిల్ మార్చింది. సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతలో హద్దులు దాటుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు సర్కారు వారి పాట ప్రమోషన్స్ లోను తన గ్లామర్ చూపించడానికి రెడీ అయ్యింది. మరి కళావతి సర్కారు వారి పాట సినిమాలో ఇంకెంత గ్లామర్ చూపిస్తుందో చూడాలి.