Advertisementt

టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్

Fri 29th Apr 2022 10:40 PM
ntr,ntr fans,ram charan,acharya movie,r ajamouli,rrr movie  టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్
NTR Fans in Tension For Koratala Movie టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ రెండు విధాలుగా టెంక్షన్ పడుతున్నారు. అందులో ఒకటి. రాజమౌళి నెక్స్ట్ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేస్తారా.. లేదంటే రామ్ చరణ్ లా ప్లాప్ అందుకుంటారా. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తో అద్భుతమైన హిట్ కొట్టిన రామ్ చరణ్ తన తదుపరి మూవీ ఆచార్య తో ప్లాప్ అందుకున్నట్టే కనిపిస్తుంది ప్రస్తుత ఆచార్య వ్యవహారం. మరి రాజమౌళి తో హిట్ కొట్టిన హీరోలు నెక్స్ట్ ప్లాప్ కొట్టడమనేది ఓ సెంటిమెంట్ గా మారింది. దాన్ని రామ్ చరణ్ కూడా బ్రేక్ చేయలేకపోయారు. ఇక ఎన్టీఆర్ చేస్తారా.. అనేది ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ లో మొదలైన టెంక్షన్.

ఇంకో టెంక్షన్ కొరటాల శివ. ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ దర్శకుడిగా హీరోలకి హిట్స్ అందించిన కొరటాల శివ మొదటిసారి ఆచార్య తో ప్లాప్ అందుకున్నారు. అసలు ఇది కొరటాల రాసిన కథేనా అని మాట్లాడుకుంటున్నారు ఆచార్య చూసిన ఆడియన్స్. అటు హీరోల ఎలివేషన్స్ కూడా ఎవరికీ నచ్ఛలేదు. కేవలం రెండు సీన్స్, రెండు పాటలు మాత్రమే ఆచార్య లో బాగున్నాయంటూ మెగా ఫాన్స్ కూడా డిస్పాయింట్ అవుతున్నారు. మరి ఇలాంటి సినిమా చేసిన కొరటాల పాన్ ఇండియా మార్కెట్ లో వెలిగిపోయే ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో చేయగలడా అనే అనుమానం, టెంక్షన్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ లో మొదలైంది. అటు రాజమౌళి సెంటిమెంట్, ఇటు కొరటాల కి ప్లాప్ అనే రెండు విషయాలతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు.

NTR Fans in Tension For Koratala Movie:

A Mountain of Tension for NTR Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ